బిజినెస్

వ్యాపార విస్తరణపై పతంజలి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న ఎఫ్‌ఎమ్‌సిజి వెంచర్.. పతంజలి ఆయుర్వేద్ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు పిటిఐకి బాబా రామ్‌దేవ్ తెలిపారు. కాగా, 500 కోట్ల రూపాయలను ఇప్పటికే బ్యాంకులు మంజూరు చేశాయిని కూడా సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ నిధులతో ముఖ్యంగా ఈ-కామర్స్, ఎగుమతుల బలోపేతంపై పతంజలి ఆయుర్వేద్ దృష్టి పెట్టింది. హరిద్వార్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు చేస్తున్న ఈ సంస్థ.. దక్షిణ భారతంలో ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందులోభాగంగానే దక్షిణాది పట్టణాల్లో ఓ మెగా ఫుడ్ పార్కులో భాగస్వామి కావాలనుకుంటోంది. ఇప్పటికే హరిద్వార్‌లో ఓ భారీ ఫుడ్ పార్కును పతంజలి ఆయుర్వేద్ నిర్వహిస్తోంది. కాగా, దేశవ్యాప్తంగా దీనికి 15,000 స్టోర్లున్నాయి. డైరీ, ఇన్‌స్టంట్ ఫుడ్స్, బేబీ కేర్, నాచురల్ కాస్మటిక్స్, హెల్త్ ప్రోడక్ట్స్‌ను పతంజలి ఆయుర్వేద్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2014-15లో 2,000 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్‌ను సాధించిన పతంజలి ఆయుర్వేద్.. ఈ ఆర్థిక సంవత్సరం 2015-16లో 5,000 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం 2,000-3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పతంజలి మెగా స్టోర్లను ప్రారంభించనున్నట్లు బాబా రామ్‌దేవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తయారీ కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.