బిజినెస్

నీటిపారుదల, వౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు వౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ బృందాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరారు. రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు విరివిగా భూములు కేటాయిస్తున్నట్టు రాజీవ్ శర్మ బృందానికి వివరించారు. జపాన్‌కు చెందిన పదవ అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ ఎక్చేంజి కౌన్సిల్ కెనిచి వాతన్ బే నేతృత్వంలో 13 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం సచివాలయంలో రాజీవ్ శర్మతో సమావేశమైంది. రాష్ట్రంలో అత్యుత్తమ స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రధానంగా లైఫ్ సైనె్సస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, హార్డ్‌వేర్ వంటి 14 రంగాలలో పరిశ్రమల స్థాపనకు ఆహ్వానిస్తున్నామని రాజీవ్ శర్మ వివరించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామని, మెట్రోరైలు, స్ట్రాటిజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌తోపాటు, అవుటర్ రింగ్ రోడ్ వెంట 13చోట్ల ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ కారిడార్లలో పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయిస్తున్నామని, ఈ రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇప్పటికే జపాన్‌కు చెందిన అనేక సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఎంతోమంది పని చేస్తున్నారని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలకు వివరించాల్సిందిగా బృందానికి రాజీవ్ శర్మ సూచించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 40 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు రోడ్ల అభివృద్ధి, మెట్రోరైలు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, అవుటర్ రింగ్ రోడ్డు వెంట పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగిన రాష్టమ్రని, 15 శాతం పన్నుల వసూళ్ళలో వృద్ధి సాధించామన్నారు. ఆర్థికంగా సుస్థిరతను సాధించామని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి వౌలిక సదుపాయల కల్పనకు అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామని పేర్కొన్నారు. పర్యాటక శాఖ కమిషనర్ సునీత భగవత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ మతానికి సంబంధించిన అనేక ప్రాంతాలు ఉన్నాయని, వాటి సందర్శనకు జపాన్ పర్యాటకులను పంపించాల్సిందిగా సూచించారు. మరోవైపు తమ కౌన్సిల్‌లో 1,000 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వారికి ఇక్కడున్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్టు జపాన్ ప్రతినిధి బృందం వివరించింది.
రాజీవ్ శర్మతో సమావేశమైన జపాన్ ప్రతినిధుల బృందం