బిజినెస్

8 శాతం వృద్ధిరేటు సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 29: వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) భారత జిడిపి వృద్ధిరేటు 8 శాతం అందుకోవడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల, ఆశాజనకమైన వర్షపాతం మధ్య వృద్ధిరేటు 8 శాతం నమోదవగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కీలక బిల్లుల అమలు విషయంలో ప్రతిపక్షాల తీరునూ విమర్శించిన జైట్లీ.. పార్లమెంట్‌లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ప్రధాన బిల్లుల ఆమోదం విషయంలో ఆటలొద్దంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ విజన్ ఫర్ ఇండియా 2020పై ఓ మెమోరియల్ లెక్చర్‌లో మాట్లాడుతూ ఉత్పాదక రంగం స్థిరంగా ఉందని, అయితే పుంజుకోవడం మొదలవుతున్న సంకేతాలున్నాయని అన్నారు.
మేము సిద్ధం: సిన్హా
ముంబయి: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న ఎవరితోనైనా మాట్లాడుతామని చెప్పారు. శుక్రవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి జయంత్ సిన్హా విలేఖరులతో మాట్లాడారు.

చిత్రం.. విజన్ ఫర్ ఇండియా 2020పై మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ