బిజినెస్

వరుస నష్టాలకు బ్రేక్ ( వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. 3 వారాలుగా నష్టాల్లోనే కదలాడుతున్న సూచీలు ఎట్టకేలకు కోలుకోగా, శుక్రవారం నమోదైన లాభాలతోనే గడచిన వారం నష్టాలు తప్పడం గమనార్హం. ఈ నెలలో లాభాల్లో ముగిసిన తొలి వారం కూడా ఇదే అయ్యింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్న నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టులపై ఆశాభావంతో మదుపరులు పెట్టుబడులపై ఆసక్తి కనబరిచారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 435.03 పాయింట్లు లాభపడి 24,870.69 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 141.10 పాయింట్లు అందిపుచ్చుకుని 7,563.55 వద్ద నిలిచింది. ఇందులో శుక్రవారం ఒక్కరోజే సెనె్సక్స్ 401.12 పాయింట్లు, నిఫ్టీ 138.90 పాయింట్లు పెరిగాయి. నిజానికి అంతకుముందు మూడు వారాల్లో సెనె్సక్స్ 1,725.24 పాయింట్లు, నిఫ్టీ 540.75 పాయింట్లు క్షీణించాయి. శుక్రవారం గనుక లాభా లు నమోదు కాకపోతే ఈ నష్టాల తీవ్రత వరుసగా నాలుగో వారానికి చేరి మరింత పెరిగేవి. కానీ ఐరోపా, జపాన్‌లు తమ ఆర్థిక వ్యవస్థల పురోగతికి ఉద్దీపనల దిశగా పయనించడం, రికార్డు స్థాయికి పడిపోయిన ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం వంటివి వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి. నిజానికి గడచిన వారం ట్రేడింగ్‌లో శుక్రవారం మినహా మిగతా రోజుల్లో మదుపరులు షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో లాభనష్టాలు స్వల్పంగానే నమోదయ్యా యి. కాగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మరింతగా పెంచాలని చూస్తుండటం స్టాక్ మార్కెట్లను కొంత ఒడిదుడుకులకు లోను చేయవచ్చన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే గడచిన వారం హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, పవర్, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, చము రు, గ్యాస్, టెక్నాలజీ, ఆటో రంగాల షేర్ల విలువ 4.89 శాతం నుంచి 0.92 శాతం పెరిగింది. అయితే క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 1.41 శా తం, 0.12 శాతం చొప్పున పడిపోయింది. ఇక బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 2.56 శాతం, స్మాల్-క్యాప్ 2.20 శాతం పెరిగింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇలో 10,420.61 కోట్ల రూపాయలు, ఎన్‌ఎస్‌ఇలో 70,348.91 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 15,848.61 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 88,235.23 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

‘సంస్కరణలు కొనసాగితే రెండంకెల వృద్ధిరేటు’
న్యూఢిల్లీ, జనవరి 30: ఆర్థిక సంస్కరణలు కొనసాగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో భారత్ జిడిపి వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ అరవింద్ పనగరియా వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు విశాల హృదయంతో ఆలోచిస్తే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) త్వరలోనే ఆచరణలోకి వస్తుందన్న ఆశాభావాన్నీ ఆయన వెలిబుచ్చారు. ప్రపంచ మార్కెట్లు స్తబ్ధుగా లేదా మందగమనంతో ఉన్నప్పటికీ భారతీయ మార్కెట్లు విస్తరిస్తున్నాయన్నారు.

‘మార్చిలోగా మూడు పోర్టుల పనులు’
న్యూఢిల్లీ, జనవరి 30: మారిటైమ్ రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం మార్చిలోగా మూడు మేజర్ పోర్టులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్టల్ర వద్ద ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం జరగనుందని శనివారం ఇక్కడ జరుగుతున్న ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా చెప్పారు. తమిళనాడులోని కొలచెల్, పశ్చిమ బెంగాల్‌లోని సగర్, మహారాష్టల్రోని దహనూర్ వద్ద పోర్టుల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు వివరించారు.