బిజినెస్

ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్ల దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 30: నల్లగొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని మిల్లర్ల నుండి ప్రభుత్వం సకాలంలో రాబట్టలేకపోతోంది. కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ముందుగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు ప్రభుత్వానికి మాత్రం సిఎంఆర్ బియ్యం ఆలస్యంగా అందించడం రివాజుగా మారింది. జిల్లాలో 2015-16 ఖరీఫ్ సీజన్‌లో 229 కోట్ల రూపాయల విలువైన 15 లక్షల 75,713 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం పౌరసరఫరాల సంస్థ అప్పగించింది. సదరు ధాన్యాన్ని మర ఆడించాకా వచ్చే 10 లక్షల 55,728 క్వింటాళ్ల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఇందుకు మిల్లర్‌కు క్వింటాల్‌కు 30 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం అప్పగించిన 15 రోజుల్లో మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. గత అక్టోబర్ నుండి నవంబర్ నెలాఖరు వరకు జిల్లాలోని మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం నుండి ప్రభుత్వానికి తిరిగి రావాల్సిన 10 లక్షల 55,728 క్వింటాళ్ల బియ్యంలో ఇప్పటిదాకా కేవలం 5 లక్షల 32,658 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి చేరాయి. మరో 5 లక్షల 23,070 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించిన ప్రభుత్వ ధాన్యం మిల్లర్ల వద్దనే ఉండిపోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన 229 కోట్ల రూపాయల విలువై ధాన్యంలో ఇప్పటిదాకా 128 కోట్ల రూపాయల విలువైన బియ్యం మాత్రమే ఇవ్వగా మరో 101 కోట్ల రూపాయల విలువైన బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నమాట. కానీ అది పట్టించుకోని మిల్లర్లు ప్రభుత్వ ధాన్యంతో దర్జాగా సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి నెమ్మదిగా కస్టమ్ మిల్లింగ్ బియ్యం అప్పగిస్తూ ప్రభుత్వ సొమ్మునే (్ధన్యం) పెట్టుబడిగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గడువు పొడగించినా మిల్లర్లు మాత్రం కస్టమ్ మిల్లింగ్ అప్పగింతలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వమి చ్చే 30 రూపాయలకుతోడు ఒక క్వింటాల్ ధాన్యాన్ని మర ఆడించడం ద్వారా మిల్లర్‌కు ఊక, తవుడు, దొడ్డు నూకలు, సన్న నూకల ద్వారా కోట్లలో ఆదాయం లభిస్తోంది ఆ మేరకు ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నట్లుగా ఇటీవల ‘కాగ్’ వెల్లడించడం మరింత ఆసక్తికరంగా మారింది. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు మిల్లర్‌కు మర చార్జీల కింద ప్రభుత్వం క్వింటాల్‌కు ఇచ్చే 30 రూపాయలతోపాటు ఉప ఉత్పత్తులైన ఊక, తవుడు, నూకల విక్రయంతో మిల్లర్‌కు మరో 200 రూపాయలు లభిస్తుంది. అంటే ఒక్కో క్వింటాల్‌కు 230 రూపాయల మేరకు మిల్లర్‌కు ఆదాయం వస్తోంది. ఇందులో మిల్లింగ్, విద్యుత్, రవాణా, హమాలి ఖర్చులుపోను భారీగానే మిగులుతుందని కాగ్ అంచనా వేసింది. ఈ రకంగా దేశ వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ బియ్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా 3,745 కోట్ల రూపాయల మేరకు గండి పడుతుందని, ఆ మేరకు మిల్లర్లకు లాభం చేకూరుతుందని కాగ్ అంచనా వేసింది. జిల్లాల్లో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ఉప ఉత్పత్తుల విక్రయం ద్వారా ఏటా 7 నుండి 8 కోట్ల రూపాయల మేరకు మిల్లర్లు లబ్ధి పొందినట్లుగా తేలింది. అయనా వారు సకాలంలో ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మిల్లర్లు మర ఆడించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం