బిజినెస్

పెట్రోల్, డీజిల్ ధరలపై మళ్లీ పెరిగిన ఎక్సైజ్ సుంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరానికి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో శనివారం కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూపాయి 50 పైసలు పెంచింది.
ఈ నెలలో ఇలా పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కాగా, తాజా పెంపుతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా 3,200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.
ఇకపోతే ఈ పెంపులతో రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలేమీ పెరగవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ముడి చమురు ధరల నేపథ్యంలో ధరల సర్దుబాట్లలో భాగంగా ఎక్సైజ్ సుంకంలో మార్పులు సహజమన్నాయి.