బిజినెస్

సిగరెట్ దుకాణాలపై కస్టమ్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అధికారులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సిగరెట్ షాపులపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 35 రకాల విదేశీ బ్రాండెడ్ సిగరెట్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఎపి కస్టమ్స్ కమిషనర్ షేక్ ఖాదర్ రెహమాన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల్లో పోలీస్ శాఖ సహకారంతో కస్టమ్స్ శాఖ ఏక కాలంలో దాడులు చేసి సుంకం చెల్లించని వివిధ అనధికార విదేశీ సిగరెట్ల ఉత్పత్తులను పట్టుకున్నారు. స్వాధీన పరచుకున్న విదేశీ సిగరెట్ల విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ఖాదర్ రెహమాన్ మాట్లాడుతూ పట్టుబడిన సిగరెట్ ప్యాకింగ్‌లపై ఏ విధమైన చట్టబద్ధమైన హెచ్చరికలు, తయారు తేదీలుకాని లేవన్నారు. దాదాపు 35 రకాల బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సిగరెట్లు పట్టుబడ్డాయన్నారు. వీటిలో త్రిబుల్ ఫైవ్, డన్‌హిల్స్, మల్‌చోరో, మోర్, రోతమ్స్ వంటి పేరున్న బ్రాండ్లు కూడా ఉన్నాయన్నారు. సింగపూర్, మలేసియా, బ్యాంకాక్, హాంకాంగ్, ఇండోనేషియా, కొరియా, చైనా, థాయ్‌లాండ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ తదితర దేశాల నుంచి ఈ సిగరెట్లు ఎలాంటి పన్నులు లేకుండా రాష్ట్రంలోకి వచ్చాయన్నారు. అధికారికంగా తెస్తే అధిక పన్నులు చెల్లించవలసి వస్తుందనే భావనతో స్మగ్లర్లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గాల ద్వారా విదేశీ సిగరెట్లను స్మగుల్డ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎటువంటి విదేశీ అక్రమ సిగరెట్లు విక్రయాలు జరపకుండా తమ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కేంద్రంలోనూ కస్టమ్స్ అధికారుల నిఘా ఉంటుందన్నారు.