బిజినెస్

సింగరేణి దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో సింగరేణి సంస్థ అంతర్గతంగా నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 60.03 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించా లని నిర్దేశించుకుంది. ప్రభుత్వపరంగా 55 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి లక్ష్యం. అయతే జనవరి మాసం ముగిసేనాటికి గడచిన 10 మాసాల్లో 100 శాతం ఉత్పాదక రేటును సంస్థ నమోదు చేసుకుంది. 48.88 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 48.89 మిలియన్ టన్నులు సాధించింది. ఏరియాల వారీగా ఇల్లెందు ఏరియా లక్ష్యం 43 లక్షల 47,500 టన్నుల లక్ష్యానికిగాను 48 లక్షల 60,573 టన్నులు సాధించి 112 శాతం ఉత్పాదక రేటుతో సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కొత్తగూడెం ఏరియా 60 లక్షల 55,600 మిలియన్ టన్నులకుగాను 67 లక్షల 19,423 టన్నులు సాధించి 111 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ఏరియా 50 లక్షల 17,200 టన్నులకుగాను 53 లక్షల 10,753 టన్నులు సాధించి 106 శాతం ఉత్పాదక రేటుతో తృతీయ స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి ఏరియా 50 లక్షల 17,200 టన్నులకుగాను 53 లక్షల 10,753 టన్నులు సాధించి 106 శాతం, మణుగూరు ఏరియా 69 లక్షల 75 వేల టన్నులకు గాను 72 లక్షల 99,212 టన్నులు సాధించి 105 శాతం, రామగుండం-3 ఏరియా 50 లక్షల 75 వేల టన్నులకుగాను 51 లక్షల 87,127 టన్నులు సాధించి 102 శాతం, భూపాలపల్లి ఏరియా 27 లక్షల 1,500 టన్నులకుగాను 27 లక్షల 51,369 టన్నులు సాధించి 102 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 43 లక్షల 23,900 టన్నులకు 44 లక్షల 9,893 టన్నులు సాధించి 102 శాతం, రామగుండం-1 ఏరియా 50 లక్షల 94,200 టన్నులకుగాను 51 లక్షల 3,890 టన్నులు సాధించి 100 శాతం, రామగుండం-2 ఏరియా 42 లక్షల 90,600 టన్నులకుగాను 42 లక్షల 17,350 టన్నులు సాధించి 98 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 27 లక్షల 63,900 టన్నులకు 17 లక్షల 96,125 టన్నులు సాధించి 65 శాతం ఉత్పాదక రేటును నమోదు చేశాయి. మందమర్రి ఏరియా 22 లక్షల 22,600 టన్నులకుగాను 13 లక్షల 14,754 టన్నులు సాధించి అత్యల్పంగా 59 శాతంతో ఉంది. మొత్తం గా 4 కోట్ల 88 లక్షల 67 వేల టన్నుల లక్ష్యానికిగాను 4 కోట్ల 89 లక్షల 70,479 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 100 శాతం ఉత్పాదక రేటును సంస్థ నమోదు చేసుకుంది. దీనిలో భూగర్భ గనుల లక్ష్యం కోటీ 9 లక్షల 60 వేల టన్నులైతే, 87 లక్షల 65,747 టన్నులు సాధించి 80 శాతం, ఓపెన్‌కాస్టు గనులు 3 కోట్ల 79 లక్షల 7 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికిగాను 4 కోట్ల 20 లక్షల 4,732 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిం చి 106 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. కాగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10 మాసాల్లో బొగ్గు ఉత్పత్తి 4 కోట్ల 5 లక్షల 81,092 టన్నులు సాధించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 8 మిలియన్ టన్నుల పైచిలుకు అధికోత్పత్తి జరిగింది.