బిజినెస్

జైలు జీవితం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ‘జైలు జీవితం బాధాకరం. ఒంటరితనాన్ని మిగిల్చింది.’ అన్నారు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించారన్న కేసులో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైళ్లో సుబ్రతా రాయ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే సహారా 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక విచారణ జరగనున్న ఒక్కరోజు ముందు రాయ్ ఈ పుస్తకం విడుదల చేయడం యాధృచ్ఛికం.
కాగా, జైలు జీవితం బాధకరమైనప్పటికీ తాను ఒత్తిడి నుంచి బయటపడగలిగానని, తన దరికి ఎల్లవేళలా ఒత్తిడి చేరకుండా చూసుకుంటూ జీవిస్తున్నానని రాయ్ తన పుస్తకం ద్వారా చెప్పారు. ఇదంతా ఆ భగవంతుడి దయగా ఆయన అభివర్ణించారు. అయితే ‘నేనేం తప్పుచేశాను’ అన్న ఆలోచనలే తన మదిలో తరచూ కదలాడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘లైఫ్ మంత్రాస్’ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఎ ట్రయాలజీ ‘్థట్స్ ఫ్రమ్ తీహార్’ పేరిట ఈ పుస్తకాన్ని సుబ్రతా రాయ్ రాశారు.
తీహార్ జైళ్లో తన జ్యుడీషియల్ కస్టడీ, జైలులో అరకొర వసతులున్న గదిలో నిర్బంధించడం దిగ్భ్రాంతిని కలిగించాయన్నారు. మదుపరుల నుంచి సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు సేకరించిన సొమ్మును తిరిగిచ్చేయాలంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 10,000 కోట్ల రూపాయల పూచీకత్తు చెల్లిస్తేనే ఈ కేసులో బెయిల్ ఇస్తామని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో విదేశాల్లోని ఆస్తులను కూడా అమ్మేందుకు సహారా ప్రయత్నిస్తుండగా, ఇవేవీ కూడా సఫలం కావడం లేదు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైళ్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో జరగనుంది.