బిజినెస్

పట్టుబడిన విదేశీ సిగరెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ దేశీయంగా భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించి కాలుష్య ప్రమాణాల్లో తిరస్కరించబడిన ఉత్పత్తులతో రూపొందిన డీజిల్ ఇంజిన్లను వాడినట్లు ప్రభుత్వ ఆదేశిత విచారణలో తేలడంతో 3.23 లక్షల వాహనాలను వెనక్కి తీసుకుంటోంది. ‘ఇ189 ఇంజిన్లను అమర్చిన 3.23 లక్షల వాహనాలను ఫోక్స్‌వాగన్ స్వచ్చంధంగా రీకాల్ చేయనుంది.’ అని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. అత్యున్నత ఆటోమోటివ్ టెస్టింగ్ ఏజెన్సీ ఎఆర్‌ఎఐ నివేదిక సమర్పణ అనంతరం మంగళవారం ఫోక్స్‌వాగన్ ప్రతినిధులు, భారీ పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. భారత్‌లో తయారైన డీజిల్ కార్లలో ఫోక్స్‌వాగన్ వైఫల్యం చెందిన ఇ189 ఇంజిన్‌ను వినియోగించిందని ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ) గుర్తించింది. ఈ ఇంజిన్ వాడకంతో అధికంగా నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు వాతావరణంలోకి వెలువడుతాయని, దీనివల్ల కాలుష్యం ఎక్కువవుతుందని పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఆ ఇంజిన్‌ను వాడిన 3.23 లక్షల వాహనాలను ఫోక్స్‌వాగన్ రీకాల్ చేయనున్నట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా, కాలుష్య నిరోధక నిబంధనలను మీరిందనే ఆరోపణలను ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వాగన్ ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆ సంస్థ సిఇఒ కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అమెరికాలో ఫోక్స్‌వాగన్ ఏకంగా 18 బిలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొంది కూడా. కాగా, 2012 జూలైలో భారత ఆటోమొబైల్ తయారీ సమాజం (ఎస్‌ఐఎఎమ్) వాహనాల్లో సమస్యలకు సంబంధించి స్వచ్చంధ రీకాల్‌ను ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా వివిధ ఆటోరంగ సంస్థలు 13.25 లక్షల వాహనాలకుపైగా రీకాల్ చేశాయి.