బిజినెస్

ప్రపంచ ఐటి రంగంలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారతీయ ఐటి రంగ దిగ్గజం, ప్రముఖ బహుళజాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఈ మేరకు ఓ ప్రధాన గ్లోబల్ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బుధవారం వెల్లడించింది. ఆయా రంగాలవారీగా అత్యంత శక్తివంతమైన, అత్యధిక విలువైన బ్రాండ్ ఏది అనేదానిపై ప్రపంచంలోని వేలాది బ్రాండ్లను బ్రాండ్ ఫైనాన్స్ 2016 వార్షిక నివేదిక పరిశీలించింది. ఈ క్రమంలోనే ఐటి రంగంలో టిసిఎస్‌ను ఎంపిక చేసింది. సంస్థ వ్యాపారం, విశ్వసనీయత, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్ ప్రతిష్ఠ తదితర అంశాల ఆధారంగా బ్రాండ్ విలువను గణించినట్లు బ్రాండ్ ఫైనాన్స్ సిఇఒ డేవిడ్ హైగ్ చెప్పారు. దీంతో అన్ని సంస్థల కంటే టిసిఎస్ 78.3 పాయింట్లను సాధించిందని, ఐటి రంగంలో ఎఎప్లస్ రేటింగ్‌ను అందుకుందన్నారు.