బిజినెస్

స్టాక్ మార్కెట్లకు చమురు సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో నుంచి బయటకు రాలేకపోతున్నాయి. ఈ వారం లో వరుసగా మూడోరోజు నష్టాలకే పరిమితమవగా, బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 315.68 పాయింట్లు పతనమై 24,223.32 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 93.75 పాయింట్లు క్షీణించి 7,361.80 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ పడిపోవడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్ల నష్టాల మధ్య విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగాయి. నిజానికి జనవరి నెలకుగాను పిఎమ్‌ఐ సర్వేలో భారతీయ సేవ రంగ కార్యకలాపాలు 19 నెలల గరిష్ఠాన్ని తాకినప్పటికీ, ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచలేకపోయింది. విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఇన్‌ఫ్రా, మెటల్, పిఎస్‌యు, బ్యాంకింగ్, ఆటో, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 4.16 శాతం నుంచి 1.58 శాతం దిగజారింది. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 2.25 శాతం, మిడ్-క్యాప్ 1.30 శాతం పడిపోయాయి. మరోవైపు అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ 3.2 శాతం పడిపోగా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, చైనా సూచీలు 2.3 శాతం నుంచి 0.4 శాతం దిగజారాయి. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు కూడా 1.2 శాతం నుంచి 0.5 శాతం వరకు నష్టపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్ సైతం 0.2 శాతం మేర పడిపోయింది.