బిజినెస్

శ్రీసిటీలో కోల్గేట్ టూత్‌బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ సెజ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన కోల్గేట్ పామోలివ్ సంస్థ టూత్‌బ్రష్‌ల ఉత్పత్తులను బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. ఆ సంస్థ దక్షిణాసియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్సామ్ బచ్చాలాని సమక్షంలో యూరప్ రీజియన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫెబియన్ టి గార్సియ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గార్సియా మాట్లాడుతూ ఇప్పటికే 200 దేశాల్లో 17.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో తమ ఉత్పత్తులు జరుగుతున్నాయని, నూతనంగా శ్రీ సిటీలో ప్రారంభించిన టూత్‌బ్రష్‌ల తయారీ పరిశ్రమలో ఏడాదికి 220 మిలియన్ల ఉత్పత్తులు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. మరో ఏడాదిలో ఈ పరిశ్రమను విస్తరింపచేసి 600 మిలియన్ టూత్‌బ్రష్‌లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ భారత్‌లో మొట్టమొదటిసారిగా టూత్ బ్రష్‌ల తయారీకి శ్రీసిటీని ఎంపిక చేసుకొని పరిశ్రమ నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.

టూత్‌బ్రష్‌ల తయారీ ప్రారంభోత్సవంలో కోల్గేట్ పామోలివ్ ప్రతినిధులు