బిజినెస్

సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశంలోని సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ప్రతియేటా 2,000 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఐఆర్‌ఇడిఎ (ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) పేర్కొంది. ‘దేశంలోని సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థల నుంచి ఏటా 2,000 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. దీంతో 2019 వరకు ప్రతి సంవత్సరం 10 వేల నుంచి 12 వేల మెగావాట్ల చొప్పున సౌర, పవన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం’ అని ఐఆర్‌ఇడిఎ సిఎండి కెఎస్.పోప్లి స్పష్టం చేసినట్లు పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరులపై పోప్లి గురువారం న్యూఢిల్లీలో జాతీయ సదస్సును ప్రారంభిస్తూ, దేశంలోని సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పటికే దేశ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని, వీటిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను రాబట్టుకోగా, పవన విద్యుత్ ప్రాజెక్టుల వాటా 430 కోట్ల డాలర్లుగా ఉందని వివరించారు.

స్టాక్ బ్రోకింగ్‌కు పరిశ్రమ హోదా
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన
బిఎస్‌ఇ బ్రోకింగ్ ఫోరమ్
ముంబయి, ఫిబ్రవరి 4: మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడానికి స్టాక్ బ్రోకింగ్‌కు పరిశ్రమ హోదా కల్పించాలని, అలాగే పన్ను సంస్కరణలను అమలు చేయాలని బిఎస్‌ఇ బ్రోకర్ల ఫోరమ్ ప్రభుత్వాన్ని కోరింది. బ్రోకింగ్ వ్యాపారానికి పరిశ్రమ హోదా కల్పించినట్లయితే ఈ రంగంలోని వారు బ్యాంకులనుంచి నిధులు పొందడానికి వీలు కావడంతో పాటుగా వాళ్లు మరిన్ని నగరాలకు తమ వ్యాపారాలను విస్తరించడానికి వీలవుతుందని బిఎస్‌ఇ బ్రోకింగ్ ఫోరమ్ బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొంది. బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో కలిపి భారతీయ బ్రోకింగ్ పరివ్రమలో 1400కు పైగా బ్రోకర్లు, మరో 50 వేల మంది రిజిస్టర్ చేసుకున్న సబ్ బ్రోకర్లున్నారని, వీరంతా కలిసి దాదాపు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఫోరమ్ పేర్కొంది. సెక్యూరిటీల లావాదేవీల పన్ను( ఎస్‌టిటి)లకు సంబంధించి రిబేట్ ఇవ్వాలని కూడా ఫోరమ్ ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ప్రభుత్వానికి ఎస్‌టిటి లభించడం కొనసాగడమే కాకుండా మదుపరులపై పన్ను భారం తగ్గుతుందని ఫోరమ్ పేర్కొంది. అంతేకాకుండా కమోడిటీస్ లావాదేవీల బ్రోకరేజ్‌కి టిడిఎస్‌నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే డివిడెండ్ పంపిణీ పన్నును తగ్గించాలని కూడా ఫోరమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ పన్నును తగ్గించడం వల్ల కంపెనీల లాభాలు పెరుగుతాయని, ఫలితంగా మదుపరులకు డివిడెండ్లలో ఎక్కువ వాటా లభిస్తుందని కూడా ఫోరమ్ తన వినతిపత్రంలో పేర్కొంది.

ఇండోర్‌లో రేపటి నుంచి
ఎంఎస్‌ఎంఇ ఎక్స్‌పో
ఇండోర్, ఫిబ్రవరి 4: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు ఇండోర్‌లో శనివారం నుంచి ‘ఇండ్ ఎక్స్‌పో’ను నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో రైల్వే, రక్షణ, ఆటోమొబైల్ రంగాలకు చెందిన కంపెనీలతో పాటు దాదాపు 120 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పాల్గొంటాయని ఇండోర్ ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ విలేఖర్లకు తెలిపారు. ఆతిథ్య మధ్యప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సంస్థలు ఈ ఎక్స్‌పోలో పాల్గొని తమతమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తాయని ఆయన వివరించారు.