బిజినెస్

వచ్చే ఏడాది 12 శాతం తగ్గనున్న ఐటి ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కరెన్సీ ఒడిదుడుకులు, ప్రత్యేకించి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడుతుండంతో వచ్చే ఆర్థిక సంవత్సంలో దేశ ఐటి-బిపిఓ రంగం ఎగుమతులు 10 నుంచి 12 శాతం మేరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ‘నాస్కామ్’ గురువారం వెల్లడించింది. మార్చి 31వ తేదీతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఈ రంగం మొత్తం మీద 12.3 శాతం వృద్ధిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఐటి-బిపిఓ రంగం ఎగుమతులు 12 నుంచి 14 శాతం వరకు పెరుగుతాయని ‘నాస్కామ్’ అంచనా వేసింది. ఇటీవల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోయి 29 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన విషయం విదితమే. దీంతో కరెన్సీ ఒడిదుడుకులు ఐటి-బిపిఓ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశంలోని ఐటి-బిపిఓ పరిశ్రమలు దాదాపు 80 శాతం ఆదాయాన్ని అమెరికా, యూరప్‌ల నుంచి ఆర్జిస్తుండటమే ఇందుకు కారణం. అయితే దేశంలో క్లౌడ్, మొబిలిటీ, ఐఓటి, బిగ్ డేటా తదితర డిజిటల్ టెక్నాలజీలు బలాన్ని పుంజుకోవడంతో పాటు స్టార్టప్‌ల రంగం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐటి-బిపిఓ రంగం ఎగుమతులు రెండంకెల వృద్ధితో 107.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని, 2015-16లో ఈ పరిశ్రమ మొత్తం మీద (దేశీయ వినియోగం, హార్డ్‌వేర్ కలిపి) 143 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నామని ‘నాస్కామ్’ చైర్మన్ బివిఆర్.మోహన్‌రెడ్డి విలేఖర్లతో అన్నారు.

270 బిలియన్ డాలర్లకు
తగ్గనున్న ఎగుమతులు

ఎఫ్‌ఐఇఓ అంచనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఎగుమతులు 265 నుంచి 270 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని ఎగుమతిదారుల సంఘం ఎఫ్‌ఐఇఓ స్పష్టం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 310.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని, అయితే ఈసారి అవి 265 నుంచి 270 బిలియన్ డాలర్లకు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక ఉద్యోగాలను కోల్పోయేందుకు దారితీయవచ్చని ఎఫ్‌ఐఇఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సాహి గురువారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో గత 12 నెలల నుంచి వరుసగా క్షీణిస్తున్న ఎగుమతులు 2015 డిసెంబర్‌లోనూ 14.75 శాతం తగ్గి 22.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆయన చెప్పారు. దేశంలో ఎగుమతుల అభివృద్ధికి ఉద్దేశించిన కార్పస్ ఫండ్ ప్రస్తుతం రూ.200 కోట్లుగా ఉందని, ఇది ఎంతమాత్రం సరిపోదని ఆయన పేర్కొంటూ, దీనిని 3000 నుంచి 5000 కోట్ల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

కేంద్ర వాణిజ్య శాఖ ఇప్పటికే సమర్ధించిన ఈ డిమాండ్‌పై ఆర్థిక మంత్రిత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని అజయ్ సాహి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో మన దేశ ఎగుమతులు 18 శాతం క్షీణించి 196.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయని, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇవి 239.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.