బిజినెస్

త్వరలోనే జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:ప్రతిపక్షాలు వాస్తవాలను గుర్తిస్తాయని, రాజ్యసభలో ఆగిపోయిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు త్వరలోనే సాకారమవుతుందన్న ఆశాభావాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ‘జిఎస్‌టిని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. మిగిలిన కొద్ది పార్టీలు కూడా వాస్తవాన్ని గుర్తిస్తాయని, చాలా త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని గురువారం ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే ‘ఇండియా ఇనె్వస్ట్‌మెంట్ సమ్మిట్’ను ప్రారంభిస్తూ జైట్లీ అన్నారు. ప్రపంచంలోని మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని విధానాలతో పోటీ పడే విధంగా ఉండేలా చూడడం కోసం ప్రత్యక్ష పన్నుల విధానాన్ని క్రమబద్దం చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియ అని, దీనికి ఫినిషింగ్ లైనంటూ ఉండదని, ఎందుకంటే సవాళ్లు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయని జైట్లీ చెప్పారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, అమ్మకంపన్నులాంటి అన్ని ప్రత్యక్ష పన్నులకు ప్రత్యామ్నాయం అయిన జిఎస్‌టి బిల్లును కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అడ్డుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మూడు మార్పులు చేయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో దీన్ని అడ్డుకుంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి జిఎస్‌టిని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ యోచన నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23న ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
కాగా, భారత దేశం పెట్టుబడిదారులకు ఎన్నో అవకాశాలను అందిస్తోందని చెప్పిన జైట్లీ రోడ్లు, హైవేలు,చమురు, గ్యాస్, పట్టణ ప్రాంత వౌలిక సదుపాయాలు, రైల్వేలు లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరోవైపు జైట్లీ ఐరోపాకు చెందిన పెట్టుబడి బ్యాంకులు, సింగపూర్, యుఏఇలాంటి దేశాలకు చెందిన పలువురు పెట్టుబడిదారులతోను చర్చలు జరిపారు. భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లలో భారతీయ మార్కెట్లు కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి నెలకొల్పడం. ఇది జరగాలంటే మనం సంస్కరణలను అమలు చేయడమే కాకుండా ఆ సంస్కరణలు ఒకే మార్గంలో ఉండేలా చూడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. అంతేకాదు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతోందని, పెట్టుబడుల ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్న పరిస్థితులను తగ్గించడం కూడా జరుగుతోందని ఆయన చెప్పారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 19 నెలల కాలంలో భారత దేశం పెట్టుబడులకోసం తన తలుపులను తెరిచే ఉంటోందని జైట్లీ అన్నారు. ప్రక్రియలను తాము సులభతరం చేశామని, పెట్టుబడుల ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్న షరతులను కుదించడం జరిగిందని ఆయన చెప్పారు. మొత్తం మీద బిజెపి అధికారంలోకి వచ్చిన గత 19 నెలల్లో ప్రభుత్వం పెట్టుబడులకు తలుపులను బార్లాతెరిచిందని జైట్లీ చెప్పారు. దేశంలో వ్యాపారం చేయడాన్ని సులువు చేయడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని కూడా ఆయన చచెప్పారు.
భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తూ ప్రపంచ జనాభాలో ఆరో వంతు జనాభా ఉండడం, వారిలో మధ్యతరగతి వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో భారీ అవకాశాలున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు విశ్వసనీయత ఉన్నప్పుడే జనం దృష్టి దానిపై పడుతుందని, పెట్టుబడులు కూడావస్తాయని ఆయన అంటూ, నిలకడయిన విధానాలు, నిరంతర చర్యల కారణంగానే ఈ విశ్వసనీయత లభిస్తుందని అన్నారు.