బిజినెస్

బ్రాడ్‌కాస్టింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సమాచార, ప్రసార, టెలికామ్ రంగాల్లోని కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన టిడిశాట్ సెమినార్‌లో మాట్లాడిన ఆయన జస్టిస్ ఆలమ్ అన్నదానికి పైవిధంగా స్పందించారు. ప్రత్యేక వ్యవస్థకు సంబంధించి టిడిశాట్ ఓ సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలని కూడా సూచించారు. టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోనూ చర్చిస్తానన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖను కూడా జైట్లీనే నిర్వహిస్తున్నది తెలిసిందే. గత ఏడాది టిడిశాట్‌లో 707 కేసులు నమోదవగా, ఇందులో ప్రసారాలకు సంబంధించి 593 కేసులు, టెలికామ్‌కు సంబంధించి 104 కేసులు ఉన్నాయి. కాగా, వౌలిక రంగం, పేదరిక నిర్మూలనకు రాష్ట్రాలు మరింతగా ఖర్చు చేస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఈ ప్రక్రియ పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం జైట్లీ ముందస్తు బడ్జెట్ చర్చల్లో భాగంగా సమావేశమయ్యారు.

టిడిశాట్ సెమినార్‌లో మాట్లాడుతున్న జైట్లీ