బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ రికార్డు లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నరేశ్ గోయల్ నేతృత్వంలోని దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్‌వేస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఏడింతలకుపైగా పెరిగి 467 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో లాభం 63 కోట్ల రూపాయలకే పరిమితమైంది. దేశీయ విమానయాన రంగంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న జెట్ ఎయిర్‌వేస్ లాభాలు వరుసగా గత మూడు త్రైమాసికాల్లో పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఇందులో ఈసారి సాధించిన లాభం గడచిన కొనేళ్లలో రికార్డు సృష్టించడం విశేషం. 2013లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్.. జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం లాభాల్లోకి దూసుకెళ్తోంది. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. ఇకపోతే ఈసారి ఆదాయం 5,702 కోట్ల రూపాయలకు ఎగిసిందని శనివారం జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది.