బిజినెస్

ఔషధాల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం దాదాపు 74 ఔషధాలకున్న పన్ను మినహాయింపు సౌకర్యాన్ని ఉపసంహరించింది. ఇందులో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, హెచ్‌ఐవిలకు వినియోగించే ఔషధాలు కూడా ఉండటం గమనార్హం. ఫలితంగా వాటికి సంబంధించిన వ్యాధిగ్రస్తులపై ఇక ఆర్థిక భారం పడనుంది. ఈ 74 రకాల ఔషధాలపై ఉన్న కనీస కస్టమ్స్ పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు గత వారమే కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సిబిఇసి) ఓ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. దీంతో కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ కీమో థెరపీ, రేడియో థెరపీ, హృదయ సంబంధ సమస్యలు, డయాబెటిస్, పార్కిన్‌సన్స్ వ్యాధి, ఎముకల వ్యాధుల నయానికి వాడే ఔషధాలు, ఇనె్ఫక్షన్ల నిరోధానికి వినియోగించే యాంటిబయటిక్స్ ధరలు పెరిగిపోనున్నాయి. అంతేగాక బ్యాక్టీరియల్ ఇనె్ఫక్షన్స్, లుకేమియా, అనస్తెటిక్ మెడికేషన్, హెచ్‌ఐవి లేదా హెపటైటిస్ బి వైరస్ సెల్స్, అలర్జీలు, ఆర్థరైటిస్, లుపస్, అల్సరేటివ్ కొలిటిస్ ఔషధాల ధరలకు సైతం రెక్కలు తొడగనున్నాయి. మెనోపాజ్, గ్లూకొమా, అనోజెనిటల్ వార్ట్స్, రసాయనాలు, పురుగుల మందులు త్రాగినపుడు వాటి విరుగుడుకు సంబంధించిన మందులు, హార్మోన్స్ లోపంతో బాధపడుతున్న పిల్లలు, యువకుల వృద్ధికి దోహదపడే ఔషధాల ధరలూ ఎగిసిపడనున్నాయి.
మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేందుకే
మరోవైపు అబ్సిక్సిమ్యాబ్, యాంటి- రేబిస్ ఇమ్యునోగ్లోబిన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ప్రోక్రాబేజిన్, సాక్వినవిర్ ఔషధాలపై కస్టమ్స్ పన్ను 35 శాతం పెరగనుందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఎమ్‌ఎస్ మణి తెలిపారు. అయితే ప్రాణాంతక వ్యాధులతోపాటు అత్యధికులను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఔషధాల ధరలు కూడా పెరిగేట్లున్న కస్టమ్స్ పన్ను మినహాయింపు ఉపసంహరణ వెనుక కారణం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. దేశీయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో తెచ్చిన మేక్ ఇన్ ఇండియాకు ఊతమివ్వాలనే ఇదంతా అని, దేశీయ తయారీదారులకు విదేశీ ఔషధ తయారీదారుల నుంచి రక్షణ కల్పించడానికేనని కెపిఎమ్‌జి ఇండియా పార్ట్‌నర్, హెడ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సచిన్ మీనన్ చెప్పారు. ఈ ఔషధాలన్నింటిని దేశీయంగానే తయారు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశమే ఈ చర్య వెనుక ఉందని మణి అన్నారు. విదేశీ సంస్థలు దేశీయంగానే మందుల తయారీ చేపడితే యువకులకు ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయన్నారు.