బిజినెస్

జిడిపి, ఆర్థిక గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిడిపి, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసితోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్‌ఇఎల్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ ఎస్‌ఇజెడ్ తదితర ప్రముఖ సంస్థలు ఈ వారం తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంతో వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 253.72 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 74.45 పాయింట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

పెరిగిన ఐఒసి చమురు శుద్ధి సామర్థ్యం

పారదీప్ (ఒడిషా), ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పారదీప్ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. 34,555 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చమురు శుద్ధి కర్మాగారానికి 2000వ సంవత్సరం మార్చి 24న అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితమివ్వగా, ఐఒసి రిఫైనరీల్లో ఇది తొమ్మిదవది. ఇప్పటికే 8 రిఫైనరీలను కలిగి ఉన్న ఐఒసి.. వాటిలో ఏటా 54.2 మిలియన్ టన్నుల ముడి చమురును శుద్ధి చేస్తోంది. ఈ క్రమంలో పారదీప్ రిఫైనరీ కూడా అందుబాటులోకి రాగా, ఐఒసి వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 70 మిలియన్ టన్నులకు పెరిగింది. ఫలితంగా ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిఫైనరీ సామర్థ్యాన్ని ఐఒసి మించిపోయినట్లైంది. గుజరాత్‌లోని జమ్‌నగర్ వద్దనున్న రిలయన్స్ రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 62 మిలియన్ టన్నులు.

చార్జీలు తగ్గించిన ఓలా క్యాబ్

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ నగరంలో 30 శాతం చార్జీలను తగ్గిస్తున్నట్లు ఓలా క్యాబ్ తెలిపింది. ఈ తగ్గింపుతో హైదరాబాద్ పరిధిలో ఓలా మినీని కేవలం కిలోమీటరుకు రూ. 7 చొప్పున బుక్ చేసుకోవచ్చని ఓలా తెలంగాణ, ఏపి బిజినెస్ హెడ్ రవితేజ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం కిలోమీటరుకు పది రూపాయలు వసూలు చేస్తున్నామని ఆయన అందులో పేర్కొన్నారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో పరిచయం చేసిన ‘ఓలా షేర్’ యాప్ ద్వారా ప్రయాణీకులు అతి తక్కువగా కిలోమీటరు రూ. 4 రూపాయలకే ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు.

తెలంగాణలో సెజ్ కోసం
కాగ్నిజెంట్ ప్రయత్నం

హైదరాబాద్, ఫిబ్రవరి 7: తెలంగాణలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఐటిరంగ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వ అనుమతిని కోరుతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఈ నెల 23వ తేదీన వాణిజ్య కార్యదర్శి రిటా టియోటియా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పరిశీలనకు రానుంది. కాగా, రంగారెడ్డి జిల్లా లో 2.51 హెక్టర్ల విస్తీర్ణంలో ఐటి, ఐటి అనుబంధ సెజ్‌ను ఏర్పాటు చేయా లనుకుంటున్నట్లు దరఖాస్తులో కాగ్నిజెంట్ సంస్థ ప్రతిపాదించింది. కాగా, బోర్డ్ ఆఫ్ అప్రూవల్ సమావేశంలో మరో 8 సెజ్ డెవలపర్ల దరఖాస్తులను కూడా పరిశీలించనున్నారు.

గత వారం దేశీయ మార్కెట్లలోకి
రూ. 2,500 కోట్ల విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విదేశీ మదుపరులు ఈ నెల తొలి వారంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి 2,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య గత నెల జనవరిలో భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. గత వారం మాత్రం పెట్టుబడులకు ఆసక్తి కనబరచడం విశేషం. అయితే స్టాక్ మార్కెట్లలో కంటే, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు అధికంగా వచ్చాయి. స్టాక్ మార్కెట్లలోకి 604 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి 1,965 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా ఈ నెల 1-5 మధ్య అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లలోకి కలిపి 2,568 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చినట్లైంది. ఇకపోతే జనవరిలో భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు 6,245 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ నెల 23న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), దివాళా బిల్లు తదితర సంస్కరణలు ఆమోదం పొందగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. దీనివల్ల విదేశీ పెట్టుబడు లు మళ్లీ దేశీయ మార్కెట్లలోకి పోటెత్తగలవన్న విశ్వాసాన్ని కనబరిచారు.