బిజినెస్

పరిశ్రమల అభివృద్ధికి 7.64 లక్షల ఎకరాల భూమి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7.64 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ముందుగా భూమి లభ్యత ఉండాలన్నది తెలిసిందే. దీన్ని బాగా అర్థం చేసుకున్న ఏపి సర్కారు ఆ దిశగా దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే 2015 జనవరి 1వ తేదీ నాటికి ఏపిఐఐసి అధీనంలో 2.93 లక్షల ఎకరాలుగా ఉన్న భూములు.. ప్రస్తుతం 7.64 లక్షల ఎకరాలకు చేరాయ. కేవలం ఏడాది వ్యవధిలోనే అదనంగా దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించగా, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక వాడల్లో 27,911 ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపనకు అనువుగా అభివృద్ధి చేశారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సులో ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయులను కూడా కుదుర్చుకున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున భూమిని సేకరించడం వల్ల పరిశ్రమలకు కేటాయింపులు సులువవుతాయని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ అనిల్ చంద్ర పునీత తెలిపారు. కాగా, వచ్చే మూడేళ్లలో 250 వరకు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయని, 10.15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏపిఐఐసి చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు మొగ్గు చూపుతున్న క్రమంలో రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి అదనపు రాయితీలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణయ్య స్పష్టం చేశారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పది లక్షల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టారు. దీంతో వచ్చే రెండేళ్లలో మిగిలిన భూమిని సేకరించే విషయమై జిల్లా కలెక్టర్లకు పరిశ్రమల శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం సేకరించిన భూముల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటి వద్ద 1.60 లక్షల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1.30 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 1.06 లక్షల ఎకరాలు ఉన్నాయ. బంజరు, ఖాళీ భూములను మాత్రమే సేకరిస్తున్న ప్రభుత్వ ఏజన్సీలు.. ఇప్పటికైతే ప్రైవేట్ వ్యక్తులు, రైతుల భూముల జోలికి వెళ్లడం లేదు.