బిజినెస్

గత వారం దేశీయ మార్కెట్లలోకి రూ. 2,500 కోట్ల విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విదేశీ మదుపరులు ఈ నెల తొలి వారంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి 2,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య గత నెల జనవరిలో భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. గత వారం మాత్రం పెట్టుబడులకు ఆసక్తి కనబరచడం విశేషం. అయితే స్టాక్ మార్కెట్లలో కంటే, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు అధికంగా వచ్చాయి. స్టాక్ మార్కెట్లలోకి 604 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి 1,965 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా ఈ నెల 1-5 మధ్య అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లలోకి కలిపి 2,568 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చినట్లైంది. ఇకపోతే జనవరిలో భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు 6,245 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ నెల 23న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), దివాళా బిల్లు తదితర సంస్కరణలు ఆమోదం పొందగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. దీనివల్ల విదేశీ పెట్టుబడు లు మళ్లీ దేశీయ మార్కెట్లలోకి పోటెత్తగలవన్న విశ్వాసాన్ని కనబరిచారు.