బిజినెస్

రూ. లక్ష కోట్ల రుణాలిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారదీప్ (ఒడిషా): ప్రధాన మంత్రి ముద్ర యోజన క్రింద చిన్న వ్యాపారులకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడ తెలియజేశారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసేలా ఉండకూడదని, ఉద్యోగాలు ఇచ్చేలా తయారవ్వాలన్నదే ప్రభుత్వ ఆశయం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి).. 34,555 కోట్ల రూపాయలతో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాన్ని మోదీ ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారం ద్వారా యువత ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చన్నారు. ఈ క్రమంలోనే ముద్ర యోజన పథకంలో భాగంగా ఇప్పటిదాకా సుమారు లక్ష కోట్ల రూపాయల రుణాలను చిన్న వ్యాపారులకు అందించామన్నారు. గత ఏడాది ఏప్రిల్ 8న ముద్ర యోజనను ప్రారంభించగా, కేవలం 10 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున రుణాలను ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. కాగా, 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు చిన్న వ్యాపారులకు రుణాలందించే ఉద్దేశంతో ముద్ర యోజన పనిచేస్తోంది. దేశంలోని జనాభాల్లో ప్రస్తుతం 65 శాతం 35 ఏళ్లలోపు వయసున్నవారే. వీరిని లక్ష్యంగా చేసుకుని ముద్ర యోజన ముందుకెళ్తోందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. యువత స్వయంగా వృద్ధిలోకి రావాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇకపోతే దేశంలోని 5.75 కోట్ల మంది నిరుద్యోగులకు 11 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి, ఈ నిధులతో ప్రారంభించే వ్యాపారాల ద్వారా 12 కోట్ల మందికి ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టింది మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) లిమిటెడ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో బ్యాంకింగ్ రంగం.. ముద్ర యోజన క్రింద 1.22 లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చిత్రం... రిఫైనరీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మోదీ