బిజినెస్

హెలికాప్టర్ల తయారీ హబ్‌గా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఫార్మా, ఐటీ కంపెనీలకు హబ్‌గా మారిన హైదరాబాద్.. భవిష్యత్తులో హెలికాప్టర్ల తయారీకి కూడా హబ్‌గా మారబోతోందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో ‘అపాచి’ హెలికాప్టర్ల పరిశ్రమను స్థాపించబోతుందని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో బుధవారం ఏర్పాటు చేసిన బోయింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కెటిఆర్ మాట్లాడుతూ, అపాచి హెలికాప్టర్ల తయారీ యూనిట్‌లో బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయన్నారు. ఆదిభట్ల, నాదర్‌గూల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ల తయారీ కోసం సెజ్ ఏర్పాటు కాబోతుందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ను హెలికాప్టర్ల తయారీ హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.