బిజినెస్

దేశ ఆర్థిక ప్రగతిలో అందరికీ భాగస్వామ్యం: నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఫిబ్రవరి 8: ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె నీరుగట్టువారిపల్లె హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ చౌడేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన చేనేత కార్మికుల సదస్సుకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతిలో అందరినీ భాగస్వాములను చేస్తామని అన్నారు. అన్ని రంగాల్లోని సమస్యలను వినడమే కాకుండా వాటిపై అవగాహన పెంచుకుని కేంద్రానికి నివేదిస్తానని, ఆయా శాఖల కేంద్ర మంత్రులతో చర్చించి పరిష్కారానికి ప్రధాని కృషి చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అందరిని కలుపుకుంటూ దేశ ప్రగతిని సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని ఆదుకోండి
మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులను, చేనేత రంగాన్ని ఆదుకోవాలని, ఈ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక కాలనీ ఏర్పాటుచేసి ఇండ్లు నిర్మించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని స్థానిక చేనేత కార్మికులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. పావలా వడ్డీ రుణాలివ్వాలని, కుటీర పరిశ్రమలుగా నడుస్తున్న చేనేతరంగానికి మదనపల్లె మున్సిపల్ అధికారులు కమర్షియల్‌పన్ను విధిస్తున్నారని, దీనిని డొమెస్టిక్ పన్నులుగా మార్పుచేసి ఆదుకోవాలని నడ్డాకు కార్మికులు వినతులు అందజేశారు. దీంతో ఈ సమస్యలన్నింటిపై సంబంధిత మంత్రిత్వశాఖకు తెలియజేసి పరిష్కరిస్తానన్నారు.

‘గాయత్రి’కి మరో నాలుగు శాఖలు

జగిత్యాల, ఫిబ్రవరి 8: గాయత్రి కో-ఆపరేట్ అర్బన్ బ్యాంక్‌కు రాబోయే 2016-17 ఆర్థిక సంవత్సరానికి నూతనంగా మరో నాలుగు శాఖల ఏర్పాటుకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంక్ నుండి అనుమతి వచ్చిందని బ్యాంక్ సిఇఓ వనమాల శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల బ్యాంక్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ గాయత్రి బ్యాంక్ ప్రస్తుతం కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో 14 శాఖలతో సేవలు అందిస్తుండగా, మరో నాలుగు బ్రాంచీలు ధర్మపురి, హుస్నాబాద్, నిర్మల్, ఆర్మూర్‌లలో ఏర్పాటు చేయడానికి రిజర్వు బ్యాంక్ అనుమతిచ్చిందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోగల సమతా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గాయత్రి బ్యాంక్‌లో విలీనం చేసుకునేందుకు కూడా రిజర్వు బ్యాంక్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. కాగా, నాలుగు బ్రాంచీలను జూన్ 2016 మాసాంతం వరకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కామారెడ్డి, హైదరాబాద్‌లలో మార్చిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంక్‌కు రూ. 192 కోట్ల డిపాజిట్లున్నాయని, రూ. 118 కోట్ల రుణాలతో రూ. 310 కోట్ల వ్యాపారానికి చేరుకున్నామని, 2,44,765 మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.