బిజినెస్

మీ సాయం మాకు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: నేపాల్‌లో విద్యుత్, హెల్త్‌కేర్, రహదారుల రంగాల్లో భారత్ పెట్టుబడులు మరింతగా పెరిగే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌కు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జైట్లీని పౌడెల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఏర్పాటుచేయాలనుకుంటున్న ఓ ప్రత్యేక వౌలికాభివృద్ధి బ్యాంకుకు సాయం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే జైట్లీ పైవిధంగా అన్నారు. భారీ భూకంపానికి సర్వం కోల్పోయిన నేపాల్.. పునర్నిర్మాణ పనుల గురించి ఈ సందర్భంగా పౌడెల్‌ను జైట్లీ అడిగారు. తమ 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. భూ విలయం నేపథ్యంలో గత ఏడాది జూన్‌లో నేపాల్ రాజధాని కట్మండూలో జరిగిన దాతల సమావేశంలో భారత్ తమ సాయాన్ని 1 బిలియన్ డాలర్లకు పెంచింది. దీనికి జైట్లీతో జరిపిన తాజా సమావేశంలో పౌడెల్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇరువురు కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. కాగా, ఈ నెల 19న నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి భారత్‌లో పర్యటించే అవకాశాలున్న క్రమంలో పౌడెల్.. జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత మదుపరులు ఆసక్తి కనబరుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన జైట్లీ.. ముఖ్యంగా విద్యుత్, హెల్త్‌కేర్, రహదారుల నిర్మాణంలో ఈ పెట్టుబడులు అధికంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. అయితే ఓ ప్రత్యేక వౌలికాభివృద్ధి బ్యాంక్‌ను నేపాల్ ఏర్పాటు చేసే యోచనలో ఉండగా, దీనికి భారత్ సాయం చేయాలంటూ జైట్లీని పౌడెల్ కోరినట్లు ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన పౌడెల్.. ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కూడా కలుసుకున్నారు. భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలను ఓలి పర్యటన బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా సుష్మా వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత పర్యటన సందర్భంగా ఓలి ఈ నెల 20న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కీలకమైన ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై సమగ్రమైన చర్చలు చేసే వీలుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

చిత్రం... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో నేపాల్ ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్
పౌడెల్ కరచాలనం