బిజినెస్

మినీ మాల్స్‌గా రేషన్ దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు మినీమాల్స్‌గా రూపుదిద్దనున్నట్టు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులతో పాటు పప్పులు, సబ్బులు, ఇతర వస్తువులను విక్రయించేలా వీటిని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఉత్పత్తిదారుల నుంచి నేరుగా సేకరించి వినియోగదారునికి తక్కువ ధరకే ఈ సరుకులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్ పండుగల సందర్భగా ప్రభుత్వం రూ. 400 కోట్ల వ్యయంతో నిత్యావసర సరుకులను కానుకగా అందించిందని గుర్తుచేసిన లింగారెడ్డి.. కానుకల పంపిణీలో మిగిలిన సరుకులను సంక్షేమ శాఖ వసతి గృహాలకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఉగాది నాటికి అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, సేకరించిన ధాన్యాన్ని ఎఫ్‌సిఐ గోడౌన్లలో నిల్వ చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం తరపున కొత్తగా గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. దీనికి అవసరమైన నిధులు అందుబాటులోనే ఉన్నాయని, ఈ సంవత్సరం రాష్ట్రంలో 40 నుంచి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. దళారుల విధానానికి స్వస్తి పలికేందుకే ప్రభుత్వం నేరుగా కొనుగోళ్లకు సిద్ధ పడుతోందన్నారు. అలాగే నిత్యావసర సరుకులు అర్హులైన పేదవారికి అందేందుకు ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, తొలుత కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని వివరించారు. రేషన్ డీలర్లకు భరోసా కల్పించేందుకు కమీషన్ పెంచడం.. నెలసరి జీతం ఇచ్చే అంశాలను పరిశీలిస్తున్నట్టు కూడా తెలిపారు. కాగా, కళాసీలకు లోడింగ్, అన్‌లోడింగ్ రేట్లను పెంచేందుకూ ఆలోచిస్తున్నట్టు తెలిపారు.