బిజినెస్

మార్కెట్లను దెబ్బతీసిన ఐటి షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. జిడిపి గణాంకాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మదుపరులను ఆకర్షించలేకపోయాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 266.44 పాయింట్లు కోల్పోయి 24,020.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 89.05 పాయింట్లు పడిపోయి 7,298.20 వద్ద నిలిచింది. ఐటి, టెక్నాలజీ, మెటల్, ఆటో, ఇండస్ట్రీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ రంగాల షేర్ల విలువ 3.40 శాతం నుంచి 0.85 శాతం మేర దిగజారాయి. కాగ్నిజెంట్ రెవిన్యూ గైడెన్స్ తక్కువగా ఉండటం ఐటి రంగ షేర్లను కుంగదీసింది. ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో ఆ సంస్థ షేర్ల విలువ 4 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ 5.50 శాతం నష్టపోగా, చైనా, హాంకాంగ్ సూచీలు సెలవు కారణంగా మూతపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1 శాతం వరకు నష్టపోయాయి. సోమవారం సెనె్సక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్లు పతనమైనది తెలిసిందే.