బిజినెస్

వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి 7.9 శాతం: క్రిసిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత జిడిపి వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.9 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రిసెర్చ్ మంగళవారం అంచనా వేసింది. అయితే ఇంతకుముందు ఈ అంచనా 8.1 శాతంగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తోందని పేర్కొంది. అయితే రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, గత ఏడాది ఆఖర్లో కురిసిన అకాల వర్షాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా క్రిసిల్ అభివర్ణించింది.