బిజినెస్

గోల్డ్ రష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకుల మధ్య పసిడి ధరలు మళ్లీ 28వేల స్థాయిని అధిగమించాయి. 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 710 రూపాయలు ఎగిసి 28,585 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 28,435 వద్ద నిలిచింది. కాగా, ఈ ఏడాదిలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పసిడి ధరలు పెరగడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ పెరుగుదలతో 2015 జనవరి 21 నాటి స్థాయిని ధరలు తాకాయి. నిజానికి గత వారం రోజులుగా బంగారం ధరలు క్రమేణా పెరుగుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం స్థాయిలో పెరగలేదు. గడచిన ఏడు రోజుల్లో ధర 1,285 రూపాయలు పెరిగితే, కేవలం మంగళవారం 710 రూపాయలు పెరిగింది. పెళ్ళిళ్ల సీజన్ కూడా కావడంతో జ్యుయెల్లర్లు కొనుగోళ్లకు పెద్దపీట వేస్తున్నారని, ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వ్యాపార వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే వెండి ధరలు సైతం మంగళవారం పరుగులు పెట్టాయి. కిలో ధర 1,180 రూపాయలు ఎగిసి 37వేల మార్కును దాటి 37,230 రూపాయల వద్ద స్థిరపడింది. గత వారం రోజుల్లో వెండి ధర 2,360 రూపాయలు పుంజుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,200 డాలర్లు పలికింది. గత ఏడాది జూన్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.
జ్యుయెల్లర్ల బంద్
మరోవైపు 2 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బుధవారం జ్యుయెల్లర్లు బంద్ నిర్వహిస్తున్నారు. రత్నాలు, ఆభరణాల రంగంలో కార్డు ద్వారాగానీ, నగదు ద్వారాగానీ 2 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువగా జరిపే లావాదేవీలకు జనవరి 1 నుంచి పాన్ కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా తెలియపరచాలని కేంద్రం స్పష్టం చేసినది తెలిసిందే. దీంతో ఈ నిర్ణయం తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నగల వర్తకులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా షాపులు మూతపడనున్నాయి. 300లకుపైగా ఆభరణాల వాణిజ్య సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేయనున్నాయి. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది ఆరంభం నుంచి 30 శాతం వ్యాపారాన్ని కోల్పోయామని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ద్విత్రీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు పడిపోయాయని, అక్కడి కొనుగోలుదారులకు పాన్ కార్డు లేకపోవడం కారణమని జిజెఎఫ్ చైర్మన్ జివి శ్రీధర్ చెప్పారు. ప్రస్తుతం దేశీయ ఆభరణాల మార్కెట్ విలువ 2.51 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, 2018 నాటికి ఇది 5 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అయితే ప్రభు త్వ నిర్ణయం ఈ అంచనాకు తూట్లు పొడుస్తోందని జ్యుయెల్లర్లు మండిపడుతున్నారు. మరోవైపు నల్లధనం వెలికితీత, ఆదాయపన్ను ఎగవేతదారులకు కళ్ళెం వేయడానికే పాన్ కార్డు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.