బిజినెస్

కడప షుగర్స్ ప్రైవేటుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కడప సమీపంలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారం ప్రైవేట్‌పరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయ. దీని మనుగడ కష్టతరంగా మారడంతో లీజుకు తీసుకునేందుకు చక్కెర ఫ్యాక్టరీల్లో అనుభవం ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్యాక్టరీని పలు వురు పారిశ్రామికవేత్తలు సందర్శించి కూడా వెళ్లారు. ప్రభుత్వపరంగా నడపడం కష్టమని తేలడంతో ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2010లో ఈ చక్కెర ఫ్యాక్టరీని అర్ధాంతరంగా క్రషింగ్ నిలిపివేసి మూసివేశారు. అప్పటినుంచి కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీలో ప్రస్తుతం 18 మంది పర్మినెంట్ కార్మికులుండగా, వీరు ఫ్యాక్టరీకి చుట్టు కాపలాదారులుగా ఉన్నారు. అయతే వీరికి జీతభత్యాలు ఇంతవరకు అందలేదు. ఫ్యాక్టరీలో పనిచేసే సీజనల్ కార్మికులకు కూడా వేతన బకాయిలు ఇవ్వలేదు. ఫ్యాక్టరీలో పనిచేస్తూ మృతి చెందిన కుటుంబాలకు, రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో పర్మినెంట్ కార్మికులకు, సీజనల్ కార్మికులకు 7 కోట్ల 46 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సివుంది. కానీ ఇంతవరకు వీరికి జీతభత్యాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫ్యాక్టరీ మూతపడటంతో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీపై సమగ్ర నివేదిక కోసం కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు ఫ్యాక్టరీని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించారు. కార్మికులకు విఆర్‌ఎస్ ఇవ్వడం తప్ప ఫ్యాక్టరీని తిరిగి పనిచేయించడం కష్టమని కమిటీ సభ్యులు రాష్ట్ర షుగర్ బోర్డుకు నివేదిక సమర్పించారు. పొరుగున ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సహకార రంగంలో నడిచే ఫ్యాక్టరీలకు భారీగా నిధులు కేటాయించారు. కానీ, కడప చక్కెర ఫ్యాక్టరీకి మాత్రం ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప నగర పరిధిలోగల అలంఖాన్‌పల్లె వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభకు హాజరైనపుడు పలువురు కార్మిక నాయకులు ఇక్కడి పరిస్థితిని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. రైతు నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డితోపాటు టిడిపి సీనియర్ నాయకుడు జి లక్ష్మిరెడ్డి, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్ ఎం లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ వరదరాజులు రెడ్డి, జి వీరశివారెడ్డి ఫ్యాక్టరీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. దీంతో రైతులకు మేలుచేకూర్చేలా ఫ్యాక్టరీ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని బాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
మరోవైపు సీజనల్ కార్మికులతోపాటు ప్రస్తుతం ఉన్న పర్మినెంట్ కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, విఆర్‌ఎస్ రూపంలో పూర్తిమొత్తంలో చెల్లించి సెటిల్ చేసే అంశం రాష్ట్ర షుగర్ బోర్డు అధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం చక్కెర ఫ్యాక్టరీని లీజుకు ఇస్తే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు విఆర్‌ఎస్, ఇతరత్రా బెనిఫిట్స్ కలిపి సుమారు రూ. 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చక్కెర ఫ్యాక్టరీని లీజుకు ఇచ్చిన పక్షంలో లీజు పొందిన వారు ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్న 10 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌తోపాటు, మొలాసిస్ పరిశ్రమ కూడా ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది. దీనివల్ల జిల్లాలో వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. అంతా అనుకున్నట్లుగా పూర్తయితే రెండు నెలల్లో కడప చక్కెర కర్మాగారం మళ్లీ కళకళలాడే అవకాశముంది.

మూతబడిన చెన్నూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ