బిజినెస్

24 వేల దిగువకు సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ బుధవారం కూడా సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. సోమ, మంగళవారాల్లో కూడా స్టాక్ మార్కెట్లు క్షీణించినది తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21 నెలల కనిష్టానికి దిగజారి 262.08 పాయింట్ల నష్టంతో 23,758.90 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 82.50 పాయింట్లు పడిపోయి 7,215.70 వద్ద నిలిచింది. రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్స్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, టెలికామ్, చమురు, గ్యాస్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 3.46 శాతం నుంచి 0.65 శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, సింగపూర్ సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.93 శాతం నుంచి 2.11 శాతం పెరిగాయి. అమెరికా మార్కెట్లు సైతం లాభాల్లో కదలాడాయి.

ఎఐఐబి ఉపాధ్యక్షుడిగా పాండ్యన్
న్యూఢిల్లీ: ఇటీవలే ఏర్పాటైన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) ఉపాధ్యక్షుడిగా, చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా భారత నామినీ డిజె పాండ్యన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. పాండ్యన్ తన 30 ఏళ్ల కెరియర్‌లో ఇంధనం, వౌలిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పనిచేశారని వివరించింది. గుజరాత్ చీఫ్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. కాగా, బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎఐఐబి 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటవగా, దాని అధ్యక్షుడు జిన్ లికున్.

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో 16 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెలలో 16 శాతం పెరిగాయి. ఈ జనవరిలో 93,355 యూనిట్ల విక్రయాలు జరిగితే, గత ఏడాది జనవరిలో 80,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలిపింది. ప్యాసింజర్ అమ్మకాలు క్రిందటిసారితో పోల్చితే 49,821 యూనిట్ల నుంచి 56,616 యూనిట్లకు పెరిగాయి. ఇందులో జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాల విషయానికొస్తే ఇంతకుముందు 36,527 యూనిట్లుగా ఉంటే, ప్రస్తుతం 45,535 యూనిట్లుగా ఉన్నాయి.

ఎస్‌ఏఆర్‌ఎల్‌కు
టాప్ ఇంపోర్ట్స్ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రపంచవ్యాప్తంగా వంట నూనెలు దిగుమతి చేసుకోవడంలో టాప్ ఇంపోర్ట్స్ అవార్డు-2015ను సరైవాలా అగ్రి రిఫైనరీస్ లిమిటెడ్ (ఎస్‌ఏఆర్‌ఎల్) దక్కించుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుని టాప్ ఇంపోర్ట్స్ అవార్డు దక్కించుకున్నట్లు ఆ కంపెనీ ఎండి రవీందర్‌కుమార్ గుప్తా బుధవారం తెలిపారు. ఉక్రెయిన్, రష్యా, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదిలోనే వంట నూనెల తయారీలో తమ కంపెనీ నేచురెల్లే బ్రాండ్‌తో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లు వివరించారు.
ఫ్లిప్‌కార్ట్‌కు ముకేశ్, అంకిత్ గుడ్‌బై
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ముకేశ్ బన్సల్, అంకిత్ నగోరి తప్పుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో వాణిజ్య, ప్రకటనల విభాగాధిపతిగా ముకేశ్ బన్సల్ వ్యవహరిస్తుండగా, ముఖ్య వ్యాపార అధికారిగా అంకిత్ నగోరి ఉన్నారు. కాగా, వీరిరువురి రాజీనామాలను బుధవారం ఓ ప్రకటనలో ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ఐఒబి నష్టం
రూ. 1,425 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఒబి) నికర నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,425.06 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 516.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ఐఒబి తెలిపింది. ఇకపోతే ఆదాయం ఈసారి 6,445.78 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,647.45 కోట్ల రూపాయలుగా ఉంది.

ఆర్‌ఇసి లాభం
రూ. 1,370 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వరంగ సంస్థ, రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్ప్ (ఆర్‌ఇసి) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015- 16) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,369.86 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 1,376.28 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్‌ఇసి అందుకుంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. ఆదాయం ఈసారి 6,037.45 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 5,244.32 కోట్ల రూపాయలుగా ఉంది.

ఎన్‌ఐఐఎఫ్‌లో పెట్టుబ