బిజినెస్

ఎన్‌ఐఐఎఫ్‌లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి పెట్టుబడులను ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది. ఇందులోభాగంగానే భారత తొలి సావరిన్ వెల్త్ ఫండైన నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)లో పెట్టుబడులు పెట్టాలని ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఆర్థిక మంత్రి సుల్తాన్ అల్ మన్సూరీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. బుధవారం ఇక్కడ జైట్లీని మన్సూరీ కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇరుదేశాల ఆర్థిక మంత్రులు.. చిన్న, మధ్యతరహా సంస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఐఎఫ్‌లో గల్ఫ్ దేశాల మదుపరులు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. మరెన్నో రంగాల్లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయన్నారు. దీనిపై మన్సూరీ స్పందిస్తూ భారత వౌలిక తదితర రంగాల్లోకి ఇప్పటికే గల్ఫ్ పెట్టుబడులు వచ్చినట్లు గుర్తుచేశారు. 40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఎన్‌ఐఐఎఫ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంటుంది. మిగతా వాటా ప్రైవేట్‌రంగ మదుపరులకుంటుంది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకుల నుంచి తట్టుకునేందుకు భారత్ నిర్మిస్తున్న వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో ముడి చమురును నిల్వ చేసేందుకు యుఎఇ ప్రభుత్వ చమురు సంస్థ అడ్నాక్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్నాటకలోని మంగళూరు, పడూర్‌లలో 5.33 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ సామర్థ్యం కలిగిన భూగర్భ స్టోరేజీలను నిర్మిస్తోంది. భారత ఇంధన అవసరాల్లో 79 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నది తెలిసిందే.

చిత్రం.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక మంత్రి సుల్తాన్
అల్ మన్సూరీ