బిజినెస్

మొండి బకాయిలు వసూలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: క్రెడిట్ వృద్ధికన్నా కూడా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లలో మొండిబకాయిలను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం స్పష్టం చేశారు. 2017 మార్చి నాటికల్లా బ్యాంకుల బ్యాంలెన్స్ షీట్లను శుభ్రం చేయడంతో పాటుగా క్రెడిట్‌కు అనుకూలంగా ఉండేలా చేయడం ఆర్‌బిఐ ఉద్దేశమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్న సమయంలో కొన్ని రుణాలు నిరర్థక ఆస్తులుగా తయారవుతున్న విషయాన్ని గుర్తించినందునే బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లను తనిఖీ చేయాలని ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుందని రాజన్ చెప్తూ, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లు ఒత్తిడికి లోనవడం మేనేజిమెంట్ దృష్టిలోకి వచ్చిందని, అధిక ఆర్థికాభివృద్ధి సాధించాలంటే బ్యాంకులు అవసరమైన రుణపరపతిని ఇచ్చే స్థితిలో ఉండాలని, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను శుభ్రం చేయడం ఒక్కటే దానికి మార్గమని ఆయన అన్నారు. బ్యాలెన్స్‌షీట్లను శుభ్రం చేయడమా, వృద్ధా, ఏది ముఖ్యమని అడిగితే బ్యాలెన్స్ షీట్లను తనిఖీ చేయడమేనని నేను స్పష్టంగా చెప్పగలనని, ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రతి దేశంనుంచి నేర్చుకున్న పాఠమిదని అన్నారు.
నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఏలు) చివరి త్రైమాసికంలో బ్యాంకులను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఒత్తిడికి గురయిన రుణాలను గుర్తించాలని ఆర్‌బిఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నికర లాభం 2015 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1115 కోట్లకు తగ్గిపోయాయని గురువారం ప్రకటించిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. మొండిబకాయిలు పెరిగిపోవడమే ఎస్‌బిఐ లాభాలు గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణమని ఈ ఫలితాలను విశే్లషిస్తే అర్థమవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనాబ్యాంక్‌లాంటి మరి కొన్ని బ్యాంకులు కూడా మొండిబకాయిలు పెరిగిపోవడం వల్ల ఒత్తిడిని భరించలేక నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకులు ఎన్‌పిఏలను గుర్తించేలా చేసే ఆర్‌బిఐ అసెట్ క్వాలిటీ రివ్యూ(ఎక్యుఆర్) మార్కెట్ల ఆటుపోట్లకు ఒక ముఖ్యమైన కారణమని కూడా రాజన్ అన్నారు. అయితే ఒత్తిడికి లోనయిన ఆస్తులను తిరిగి గాడిలో పెట్టడానికి ఇది అవసరమని ఆయన అన్నారు. సమస్య ఉందని గుర్తించినప్పుడు మాత్రమే ఆపరేషన్ చేసి దాన్ని నయం చేయవచ్చని ఆయన అన్నారు.