బిజినెస్

అంతర్జాతీయ ఒడిదుడుకుల నడుమ 7.6 శాతం వృద్ధి ఘనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలు ఎంతో ఘనమైనవి, ప్రాధాన్యతతో కూడినవేనని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉందని ఆ శాఖ స్పష్టం చేసింది. ‘ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఒడిదుడుకులు, గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుందన్న సిఎస్‌ఓ (కేంద్ర గణాంకాల సంస్థ) అంచనాలు నిస్సందేహంగా ఎంతో విలువైనవి, చాలా ప్రాధాన్యతతో కూడినవే’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో కొనసాగే సామర్ధ్యం భారత్‌కు ఉందన్న వాస్తవాన్ని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో భారత్‌కు కూడా ఎటువంటి మినహాయింపు లేదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పుడు నిత్యం ఏదోఒక కొత్త సవాలు ఉత్పన్నమవడం, కొత్త పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణ విషయంగా మారిందని, వీటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమైందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 3.6 శాతంగా ఉంటుందని గతంలో అంచనా వేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇటీవల దానిని 3.4 శాతానికి కుదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది భారత వృద్ధిరేటు మాత్రం 7.3 శాతంగానే ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఈ విషయమై శక్తికాంత దాస్ మాట్లాడుతూ, దేశ వ్యవసాయ రంగంలో సవాళ్లు ఉన్నాయని, వరుసగా రెండేళ్లు వర్షాభావ పరిస్థితును ఎదుర్కోవడమే ఇందుకు కారణమని, అయినప్పటికీ ఆహార పంటల ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని అన్నారు. ‘దేశంలో గత నాలుగేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో భూమిలో తేమ తగ్గి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ, వచ్చే ఏడాది రుతుపవనాలు ఎలా ఉంటాయో ఎదురుచూస్తోంది’ అని శక్తికాంత దాస్ తెలిపారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో స్థిరమైన పురోభివృద్ధి కనిపిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్తత్తి రంగంలో 9.5 శాతం, పారిశ్రామిక రంగంలో 7.3 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న సిఎస్‌ఓ అంచనాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీలో గురువారం విలేఖర్లతో మాట్లాడుతున్న శక్తికాంత దాస్