బిజినెస్

మార్కెట్‌లోకి రిలయన్స్ రిటైల్ ఎల్‌వైఎఫ్ మొబైల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్.. వాలెంటైన్ డే (ప్రేమికుల దినోత్సవం) వేడుకల సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ ఎల్‌వైఎఫ్-4జి మొబైల్స్‌ను పరిచయం చేసింది. ‘టుగెదర్‌నెస్ ఆఫర్’ పేరిట రిలయన్స్ రిటైల్ ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ శ్రేణి ఎల్‌వైఎఫ్ మొబైల్స్ ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ మేర కు సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఫ్లేమ్ 1, విండ్ 6 మోడళ్లతో ఎల్‌వైఎఫ్-4జి మొబైల్స్‌ను రిలయన్స్ రిటైల్ మార్కెట్‌లోకి తీసుకురాగా, ఫ్లేమ్ 1 ధర 6,399 రూపాయలు, విండ్ 6 ధర 7,099 రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే 999 రూపాయల విలువైన సెల్ఫీ-స్టిక్‌ను 600 రూపాయలకే విక్రయిస్తున్నట్లు కూడా రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. అలాగే పవర్ బ్యాంక్‌ను 40 శాతం రాయితీతో 720 రూపాయల కు అమ్ముతున్నట్లూ తెలిపింది.