బిజినెస్

రూ. 600 తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగారం ధరలు శనివారం ఒక్కరోజే భారీగా పడిపోయాయి. 21 నెలల గరిష్ఠ స్థాయిని కోల్పోతూ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 600 రూపాయలు దిగజారి 29,050 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 28,900 రూపాయలకు దిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాలు, దేశీయంగా జ్యుయెల్లర్ల నుంచి తగ్గిన డిమాండ్ ధరల పతనానికి దారితీసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు పుత్తడి ధర 0.68 శాతం క్షీణించి 1,237.90 డాలర్లుగా నమోదవగా, వెండి ధర కూడా 0.03 శాతం కోల్పోయి 15.75 డాలర్లు పలికింది. కాగా, దేశీయంగా కిలో వెండి ధర స్వల్పంగా 50 రూపాయలు తగ్గి 37,800 రూపాయల వద్ద స్థిరపడింది. గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయినది తెలిసిందే. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర 710 రూపాయలు పెరిగితే, కిలో వెండి ధర 1,180 రూపాయలు ఎగిసింది. అలాగే శుక్రవారం బంగారం ధర 850 రూపాయలు, వెండి ధర 750 రూపాయలు పుంజుకున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం రూ. 3,342 కోట్లు
ముంబయి, ఫిబ్రవరి 13: ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలను మొండి బకాయిలు గండి కొడుతున్న నేపథ్యంలో మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో భారీ నష్టాలను చవిచూసింది. 3,342.04 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో బ్యాంక్ 333.98 కోట్ల రూపాయల లాభాన్ని అందుకోవడం గమనార్హం. ఆదాయం ఈసారి 11,726.95 కోట్ల రూపాయలుగా, పోయినసారి 11,808.34 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కాగా, స్థూల నిరర్థక ఆస్తులు 3.85 శాతం నుంచి 9.68 శాతం వరకు పెరగగా, నికర నిరర్థక ఆస్తులు 2.11 శాతం నుంచి 5.67 శాతానికి ఎగిశాయి.