బిజినెస్

మార్కెట్‌ను వీడని నష్టాలు ( వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ స్థాయిలో నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,630.85 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 508.15 పాయింట్లు క్షీణించాయి. అంతకుముందు వారం కూడా సూచీలు పతనమవగా, ఈ రెండు వారాల్లో సెనె్సక్స్ 1,884.57 పాయింట్లు, నిఫ్టీ 582.60 పాయింట్లు దిగజారాయి. ప్రస్తుతం సెనె్సక్స్ 23 వేల స్థాయికి దిగువన 22,986.12 వద్ద, నిఫ్టీ 7 వేల స్థాయికి క్రింద 6,980.95 వద్ద నిలిచాయి. ఇకపోతే గడచిన వారం ట్రేడింగ్ సరళిని పరిశీలిస్తే ప్రధాన సంస్థల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా నమోదవడం మదుపరుల పెట్టుబడులను దెబ్బతీశాయి. చాలా సంస్థలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమవడం.. నష్టాలకు కారణమైంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో 61.67 శాతం మేర లాభం తగ్గిపోయింది. ఇది మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీసింది. అలాగే మరికొన్న ప్రముఖ సంస్థల లాభాలు గణనీయంగా పడిపోగా, మరికొన్ని నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మార్కెట్లు భారీ నష్టాలకు గురయ్యాయి. ‘అసంతృప్తికరంగా నమోదైన ఆర్థిక ఫలితాలు, రూపాయి మారకం విలువ పతనం, ముడి చమురు ధరలు ఏళ్ల తరబడి కనిష్టానికి దిగజారడం వంటివి స్టాక్ మార్కెట్లను నష్టపరిచాయి.’ అని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. మరోవైపు అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు ఉన్న అవకాశాలపై ఆందోళనలతో ఆసియా, ఐరోపా మార్కెట్ల నష్టాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను కూలదోశాయి. ఇకపోతే గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 2,788.57 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 6.96 శాతం, స్మాల్-క్యాప్ 8.39 శాతం పడిపోగా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, చమురు, గ్యాస్, ఐటి, బ్యాంకింగ్, టెక్నాలజీ, పవర్, ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్ల విలువ గరిష్ఠంగా 11.35 శాతం నుంచి 4 శాతం క్షీణించింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,268.51 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 87,430.77 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,846.62 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 84,978.59 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.