బిజినెస్

బోణీ రూ. 22 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత్‌ను ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రమోషన్ సెషనైన ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ తొలిరోజే 22,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్‌ఐడిసి)తో అనిల్ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్ గ్రూప్ సంస్థ ట్విన్‌స్టార్ డిస్‌ప్లే టెక్నాలజీస్ ఎమ్‌ఒయు కుదుర్చుకుంది. తైవాన్‌కు చెందిన ఆట్రన్ సాంకేతిక సహకారంతో ఓ ఎల్‌సిడి ఉత్పాదక కేంద్రాన్ని ట్విన్‌స్టార్ ఏర్పాటు చేయనుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది త్వరలోనే చెబుతామని సంస్థ స్పష్టం చేసింది. కాగా, దీని కోసం మొత్తం ఐదు విడతల్లో భాగంగా 68,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇక మరో ఒప్పందం ఎమ్‌ఐడిసితో రేమండ్ ఇండస్ట్రీస్ కుదుర్చుకోగా, 1,400 కోట్ల రూపాయలతో అమరావతి జిల్లాలోగల నంద్‌గాన్ టెక్స్‌టైల్ పార్కులో ఓ ప్లాంట్‌ను రేమండ్ ఏర్పాటు చేయనుంది. మరో ఒప్పందం విషయానికొస్తే హిందుస్థాన్ కోకకోలా బేవరేజెస్, జైన్ ఇరిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య కుదిరింది. విదర్భలోని నారింజ రైతుల నుంచి సేకరించిన ఫలాలతో జ్యూస్ ఫ్యాక్టరీని పెట్టనున్నారు. ఇక చైనాకు చెందిన సంస్థ సానీ గ్రూప్ రాబోయే పదేళ్లలో ఒక బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను భారత్‌లో పెట్టనున్నట్లు ప్రకటించింది.
భారత్‌పైనే దృష్టి
ప్రపంచ వ్యాపార, పారిశ్రామికవేత్తల దృష్టి ఇప్పుడు చైనా నుంచి భారత్ వైపు మళ్లిందని స్వీడన్ ప్రధాన మంత్రి స్ట్ఫీన్ లాఫ్‌వెన్ అన్నారు. ఇక్కడ ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా వీక్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రగతిని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి కుమార మంగళమ్ బిర్లా, ముఖేశ్ అంబానీ, సైరస్ మిస్ర్తి, చందాకొచ్చర్ తదితర వ్యాపార ప్రముఖులు వచ్చారు.