బిజినెస్

రామగుండం ఎన్టీపీసీకి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీకి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా అవార్డును ఎన్టీపీసీ ఇడి అందుకున్నట్లు స్థానిక అధికార ప్రతినిధి తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఇడి వెంకటేశ్వరన్, రామగుండం ఎన్టీపీసీ ఇడి ప్రశాంత్ కుమార్ మహాపాత్రులకు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సిఎండి గురుదీప్ సింగ్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు. కాగా, రామగుండం ఎన్టీపీసీలో గత నెల రోజుల క్రితం బిజినెస్ ఎక్స్‌లెన్స్ టీం పర్యటించి ఎన్టీపీసీలో జరుగుతున్న విద్యుదుత్పత్తితో పా టు సిఎస్‌ఆర్‌సిడి పరిశీలించారు. దేశవ్యాప్తంగా పలు ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో రామగుండం ఎన్టీపీసీకి అత్యధిక పాయింట్లు లభించడంతో బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైంది.