బిజినెస్

ఆక్వా రైతుకు ‘నకిలీ’ గండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: రైతుల ఆశలను, మార్కెట్‌లోని అవకాశాన్ని అందిపుచ్చుకుని అక్రమంగా పుట్టుకొచ్చిన కొన్ని హేచరీలు నకిలీ సీడ్‌తో ఆక్వా రైతులను నిలువునా ముంచాయి. నాలుగేళ్లుగా సిరులు కురిపిస్తున్న వెనామీ రొయ్యను నమ్ముకుని ఎందరో ఔత్సాహికులు ఆక్వా సాగుకు ముందుకు వచ్చారు. అయతే మార్కెట్‌లో ఉన్న గిరాకీని ఆసరా చేసుకున్న కొంతమంది వ్యాపారులు వారికి నకిలీ సీడ్ అంటగట్టారు. మార్కెట్‌లో రొయ్యలు మంచి ధర పలుకుతున్నా తెల్లమచ్చ, వైరస్, వర్షం ప్రభావంతో వచ్చిన చీడపీడలు ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయ. చెరువులను తుడిచి పెట్టేస్తున్నాయ. జిల్లాలో కోస్తా తీర మండలాల్లో ఉన్న వేలాది ఎకరాలలో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో వెనామీ సాగు జోరుగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్య ధరలు ఆశాజనకంగా ఉండటంతో రొయ్య పిల్లల ఉత్పత్తిదారులు రైతులు ఆర్థికంగా స్థిరపడ్డారు. వారిని చూసి కొందరు ఔత్సాహికులు గత రెండేళ్లుగా ఆక్వా సాగుపై మొగ్గు చూపారు. తీర ప్రాంతాలలోని బీడు భూములను సైతం ఎకరా 15 లక్షలకుపైగా కొనుగోలు చేసి ఆక్వా సాగుకు సిద్ధపడ్డారు. ఆక్వా సాగు విస్తృతంగా పెరగటంతో రొయ్య పిల్లలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గ పిల్లల ఉత్పత్తి లేకపోవటంతో హేచరీలు రొయ్య పిల్లల ధరలు గణనీయంగా పెంచాయి. ఇదే అక్రమా ర్కుల రంగ్రపవేశానికి ఊతమి చ్చింది. ప్రభుత్వ అనుమతులు లేని కొన్ని హేచరీలు కనీస ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేసిన రొయ్య పిల్లల్ని రైతులకు అమ్మేశాయ. రొయ్య పిల్లల ఉత్పత్తికి చెన్నైకి చెందిన కోస్టల్ అథారిటి అనుమతి తప్పనిసరి. వారి నిబంధనల మేరకు హేచరీ నిర్మిస్తే వారు అనుమతులు మంజూరు చేసి నాణ్యమైన రొయ్యలు పంపిణీ చేస్తారు. కానీ సాగు పెరగటంతో, సీడ్ గిరాకీ పెరగటంతో అనుమతులు లేని హేచరీల వద్ద రైతులు సీడ్ కొనుగోలు చేసి సాగు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఉత్పత్తి చేసిన సీడ్‌కు సైతం వైరస్ సోకటంతో పంట దెబ్బతింటోంది. ఇటీవల జిల్లాలోని మత్స్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా, అధిక శాతం హేచరీలకు అనుమతులు లేవని తేలింది. దీంతో కొన్ని హేచరీలను సీజ్ చేశారు. అయినా నకిలీ రొయ్య పిల్లల ఉ త్పత్తి హేచరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. ఎకరా చెరువుకు కనీసం లక్ష నుండి రెండు లక్షల వరకు రొయ్య పిల్లలు వదులుతుండగా, నెలరోజులలోపే అవి ఎర్లీ మోటార్ సిండ్రమ్స్ (ఇఎంఎస్) సోకి చనిపోతున్నాయి. అరకొరగా బతికినా వాటికి వైట్ స్పాట్ (తెల్లమచ్చ) సోకుతోంది. దీని కారణంగా ఎనభై శాతం ఆక్వా రైతులు గణనీయంగా నష్ట పోయారు. వైరస్ దెబ్బతో కుదేలవుతున్న రైతులు వచ్చిన కాడికే అంటూ 40-50 కౌంట్లతోనే రొయ్యను తెగనమ్ముతున్నారు. వైరస్ కారణంగా చెరువులో పిల్లలు వదిలినప్పటి నుండి ఖరీదైన మందులు వాడుతున్నా ప్రయోజనం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఆక్వారంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను తట్టుకోలేని రైతులు కొందరు సాగుపై మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో నకిలీ హేచరీల ధనదాహానికి రైతులు బలైపోతున్నారు. మార్కెట్‌లో ఆశించిన ధరలున్నప్పటికీ వైరస్ కారణంతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా రైతులకు నాణ్యమైన సీడ్ అందేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆక్వా రైతాంగం కోరుతోంది.