బిజినెస్

ముంచిన బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం పెట్టుబడులకు ఆసక్తి కనబరిచిన మదుపరులు.. మంగళవారం మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 362.15 పాయింట్లు పతనమై 23,191.97 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 114.70 పాయింట్లు క్షీణించి 7,048.25 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడులను మదుపరులు పెద్ద ఎత్తున ఉపసంహరించుకోవడంతో సూచీలు వరుస లాభాలను కొనసాగించలేకపోయాయి. మొండి బకాయిలు ప్రభుత్వ బ్యాంకుల లాభాలను ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గణనీయంగా తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నాలుగో త్రైమాసికంలోనూ పరిస్థితి ఇలాగే ఉండొచ్చని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అంచనా వేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా దెబ్బతీయగా, బ్యాంకింగ్ షేర్లను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. కేవలం ఎస్‌బిఐ షేర్ల విలువే 6.49 శాతం పడిపోగా, దాని మార్కెట్ విలువ 8,422 కోట్ల రూపాయలు దిగజారింది. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 5.89 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.60 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.50 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.30 శాతం, అలహాబాద్ బ్యాంక్ 3.75 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.66 శాతం, ఐడిబిఐ బ్యాంక్ 2.79 శాతం, దేనా బ్యాంక్ 2.10 శాతం, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.37 శాతం చొప్పున నష్టపోయాయి. నిజానికి ఉదయం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే నడిచాయి. సెనె్సక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఇకపోతే ఆయా రంగాలవారీగా క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, టెలికామ్, ఇండస్ట్రీ, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఇంధనం రంగాల షేర్ల విలువ 3.06 శాతం నుంచి 1.83 శాతం క్షీణించింది. మరోవైపు ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 3.29 శాతం నుంచి 0.20 శాతం మేర లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.22 శాతం, 0.40 చొప్పున పుంజుకున్నాయి. జర్మనీ సూచీ మాత్రం 0.24 శాతం మేర నష్టపోయింది.