బిజినెస్

యుబిహెచ్‌ఎల్.. విల్‌ఫుల్ డిఫాల్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్)ను మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బ్యాంక్ తెలిపింది. మరోవైపు ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు యుబిహెచ్‌ఎల్ న్యాయవాదులను సంప్రదిస్తోంది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులకు 6,963 కోట్ల రూపాయలు బకాయిపడినది తెలిసిందే. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 800 కోట్ల రూపాయలు రావాలి. కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన 17 బ్యాంకులు 2010లో ఎస్‌బిఐ నేతృత్వంలో ఓ కూటమిగా ఏర్పడగా, వచ్చే నెల 17న రుణాల వసూలులో భాగంగా ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను కూడా ఈ కూటమి వేలం వేయనుంది. ఎస్‌బిఐకి 1,600 కోట్ల రూపాయలు, ఐడిబిఐకి 800 కోట్ల రూపాయలు బకాయిపడిన కింగ్‌ఫిషర్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 410 కోట్లు, యూకో బ్యాంక్‌కు రూ. 320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 310 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు రూ. 150 కోట్లు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌కు రూ. 140 కోట్లు, ఫెడరల్ బ్యాంక్‌కు రూ. 90 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు రూ. 60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌కు రూ. 50 కోట్లు బకాయి పడింది. కాగా, ఇంతకుముందు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బిఐలు కూడా కింగ్‌ఫిషర్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాయి.
జాతి ప్రయోజనార్థం తిరిగి చెల్లించాలి
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యమున్నవారు జాతి ప్రయోజనార్థం తప్పకుండా బకాయిలు తీర్చాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంతసుబ్రమణ్యన్ కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గనిర్దేశకాల ప్రకారం విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ముద్రపడిన సంస్థకు మరే ఇతర బ్యాంక్, ఆర్థిక సంస్థలు మళ్లీ రుణాలివ్వవు. అంతేగాక బకాయిపడిన మొత్తం చెల్లించి విల్‌ఫుల్ డిఫాల్టర్ జాబితా నుంచి పేరు తొలిగించుకున్నాక కూడా ఐదేళ్లపాటు ఆ సంస్థ ప్రమోటర్లకు మరే ఇతర సంస్థల కోసం రుణాలు తీసుకునే సౌకర్యం ఉండదు.