బిజినెస్

స్మార్ట్ఫోన్ @ రూ. 251

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను బుధవారం దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. కేవలం 251 రూపాయలు ధర కలిగిన ఈ స్మార్ట్ఫోన్‌ను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ మార్కెట్‌కు పరిచయం చేస్తారని సంస్థ పేర్కొన్నది తెలిసిందే. కాగా, దేశీయ మొబైల్ పరిశ్రమనే కాదు.. ప్రపంచ మొబైల్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఈ స్మార్ట్ఫోన్ బుకింగ్స్ గురువారం నుంచి మొదలుకాను న్నాయ. ‘ఫ్రీడమ్ 251’ పేరుతో వచ్చిన ఈ 3జి స్మార్ట్ఫోన్‌ను 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నా యి. ఇంతకుముందు రింగింగ్ బెల్స్.. భారత్‌లోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను 2,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే. కాగా, అనిల్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)తో కలిసి డేటావిండ్ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు, 999 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను అందిస్తామని గత ఏడాది ప్రకటించింది. అయతే ఇంకా అది మార్కెట్‌లోకి రాలేదు.
ఐసిఎ ఆందోళన
మరోవైపు భారత సెల్యులార్ సంఘం (ఐసిఎ) 251 స్మార్ట్ఫోన్‌పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. రాయితీలోనైనాసరే స్మార్ట్ఫోన్ ధర 3,500 రూపాయల కంటే తక్కువగా ఉండటం మార్కెట్‌కు మంచిది కాదని అభిప్రాయపడ్డ ఐసిఎ.. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరముందంటూ టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖను రాసింది. ఇంత తక్కువ ధరకు స్మార్ట్ఫోన్‌ను ఎలా ఇస్తున్నారని తెలుసుకోకుండానే ఫోన్ ప్రారంభోత్సవానికి రాజకీయ, ప్రభుత్వ వర్గాలు హాజరు కావడం కూడా సరికాదని ఐసిఎ అభిప్రాయపడింది.

చెత్తతో విద్యుత్ తయారీకి జిందాల్ సంస్థతో జివిఎంసి ఒప్పందం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 17: విశాఖ నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి విద్యుత్ తయారీకి సంబంధించి జిందాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టు అండ్ ఫ్యాబ్రికేషన్ (జెఐటిఎఫ్) సంస్థతో మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) బుధవారం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఒప్పందంపై సంతకం చేయగా, ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. నగరంలో రోజుకు దాదాపు 950 టన్నుల మేరకు చెత్త ఉత్పత్తి అవుతుంది. దీన్ని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అయితే చెత్త నుంచి విద్యుదుత్తత్తి తయారు చేయాలని చాలా కాలంగా జివిఎంసి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇందుకోసం జెఐటిఎఫ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇటీవల ఈ మేరకు ప్రాథమికంగా అవగాహనకు వచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కనె్సషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఒప్పందం కింద భూ బదలాయింపు, చెత్త సరఫరా, తదితర అంశాలు ఉంటాయి. 150 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్లాంట్ నిర్మాణం 18 నెలల్లో పూర్తి అవుతుంది. 20 ఎకరాల స్థలాన్ని నగర శివార్లలోని ఆనందపురం పరిసరాల్లో కేటాయిస్తున్నామని జివిఎంసి కమిషనర్ తెలిపారు. ఈ సంస్థ 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఈ విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఈపిడిసిఎల్ ముందుకు వచ్చిందని తెలిపారు.