బిజినెస్

ఈ రెండేళ్లు జిడిపి వృద్ధి 7.5 శాతమే: మూడీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ ఏడాది, వచ్చే ఏడాది 7.5 శాతంగానే ఉంటుందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ గురువారం అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చైనా ఆర్థిక మందగమనం దీనికి కారణమని అభిప్రాయపడింది. అయితే ముడి చమురు తదితర ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశంగా అభవర్ణించింది. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిలపై మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జాగ్రత్త చాలా అవసరమని ‘2016-17 గ్లోబల్ మాక్రో ఔట్‌లుక్’పై ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 6.8 శాతంగానే ఉండొచ్చని అంబిత్ క్యాపిటల్ రిసెర్చ్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) కంటే ఈసారి జిడిపి వృద్ధి తగ్గవచ్చంటూ తమ రిసెర్చ్ నోట్‌లో పేర్కొంది. క్రిందటిసారి భారత జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా ఉంది.