బిజినెస్

రూ. 15.2 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని, ముంబయి మహా నగరంలో వారం రోజులు జరిగిన పెట్టుబడుల జాతర గురువారం ముగిసింది. మేక్ ఇన్ ఇండియా వీక్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 15.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయా రాష్ట్రాల్లోని వివిధ రంగాల్లోకి వచ్చాయని డిఐపిపి కార్యదర్శి అమితాబ్ కాంత్ ఇక్కడ ఎమ్‌ఎమ్‌ఆర్‌డిఎ గ్రౌండ్స్ వద్ద జరిగిన ముగింపు విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ మేక్ ఇన్ ఇండియా వీక్ విదేశీ పెట్టుబడుల రాకకు దోహదపడగలదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపరులను భారత్ వైపునకు ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా విలేఖరుల వద్ద వ్యక్తం చేశారు. ఇకపోతే మొత్తం పెట్టుబడుల్లో సగానికిపైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహారాష్టక్రే దక్కాయి. 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్టక్రు వచ్చాయని కాంత్ ఈ సందర్భంగా తెలిపారు. 2.500లకుపైగా విదేశీ సంస్థలు, 8,000లకుపైగా దేశీయ సంస్థలు మేక్ ఇన్ ఇండియా వీక్ సదస్సులో పాల్గొన్నాయి. 68 దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు హాజరవగా, 72 దేశాల నుంచి వివిధ రంగాల వ్యాపార బృందాలు విచ్చేశాయి. ఇక ఈ నెల 13న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సెంట్రల్ ముంబయిలోని బికెసి వద్దనున్న ఎమ్‌ఎమ్‌ఆర్‌డిఎ గ్రౌండ్స్‌లో మేక్ ఇన్ ఇండియా వీక్‌ను అట్టహాసంగా ప్రారంభించగా, దీని ప్రచారానికే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని సుమారు 17 రాష్ట్రాలు పాల్గొనగా, వీటిలో బిజెపి పాలిత రాష్ట్రాలే అధికం. 50కిపైగా సెమినార్లలో ఈ రాష్ట్రాలు పాల్గొనగా, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను అందిపుచ్చుకున్నాయి. రాబోయే దశాబ్దకాలంలో దేశ జిడిపిలో ఉత్పాదక రంగాన్ని 25 శాతానికి పెంచాలని, తద్వారా ఉద్యోగ, ఉపాధి సృష్టికి దోహదపడాలనే లక్ష్యంతో మోదీ సర్కారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చినది తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగానే తొలిసారిగా మేక్ ఇన్ ఇండియా వీక్‌ను నిర్వహించగా, ఇందు లో టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బిర్లా గ్రూప్ తదితర దిగ్గజాలన్నీ పాల్గొన్నాయి. తమ అనుబంధ రంగాల్లో భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కాగా, దేశంలో పారిశ్రామికాభివృద్ధి అంతటా జరగాలన్న కాంత్.. ఈ విషయంలో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికీకరణ ఒకేచోట కేంద్రీకృతమైనా.. సహజ వనరులకు ఇబ్బందేనని అభిప్రాయపడ్డారు. అయతే విజయవంతంగా ముగిసిన ఈ సదస్సులో అగ్నిప్రమాదం ఓ అపశృతిగా మిగిలితే, దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొన్న ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమా దం వాటిల్లకపోవడంతో సర్కారు ఊపిరి పీల్చుకోగలిగింది.
తెలంగాణ ఏరోస్పేస్ విధానం
తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగాల ప్రగతికి ఓ విధానాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య, విద్యుత్ శాఖల కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా వీక్ చివరి రోజున ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ తెలంగాణను ఏరోస్పేస్, రక్షణ రంగాల హబ్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. పరోశోధనాభివృద్ధి, తయారీ, స్టార్టప్‌లు, ఎస్‌ఎమ్‌ఇలతో దీన్ని నిర్మిస్తామన్నారు. 2,500 కోట్ల రూపాయలతో వచ్చే నాలుగేళ్లలో మరో మూడు ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అలాగే సౌర విద్యుదుత్పత్తి విధానంలో భాగంగా దాదాపు 2,500 మెగావాట్ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలియజేశారు. ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫర్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కోసం నెదర్లాండ్స్, టెక్సాస్ (అమెరికా) విశ్వవిద్యాలయాలతో టై-అప్ అయ్యామని కూడా చెప్పారు. మెదక్‌లో నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం... మేక్ ఇన్ ఇండియా వీక్ ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న డిప్ కార్యదర్శి అమితాబ్ కాంత్