బిజినెస్

దేశీయ మదుపరుల దూకుడు -- వారాంతపు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రెండు వారాల నష్టాలకు బ్రేక్‌వేస్తూ గడచిన వారం లాభాల్లో ముగిశాయి. వచ్చే వారంతో ఫిబ్రవరి ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కున్న గడువు ముగియనున్న క్రమంలో అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 723.03 పాయింట్లు ఎగిసి 23,709.15 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 229.80 పాయింట్లు పుంజుకుని 7,210.75 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 1,884.57 పాయింట్లు, నిఫ్టీ 584.60 పాయింట్లు కోల్పోయినది తెలిసిందే. నిజానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలోనూ మొండి బకాయిలు మరింతగా పెరగవచ్చని, అవి లాభాలను ప్రభావితం చేయవచ్చంటూ వేసిన అంచనా బ్యాంకింగ్ రంగ షేర్లను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ మొండి బకాయిల కారణంగా బ్యాంకింగ్ రంగ సంస్థలు భారీ నష్టాలకు లోనవగా, ఎస్‌బిఐసహా పలు సంస్థల లాభాలు సగానికిపైగా ఆవిరైపోయాయి. దీంతో గడచిన వారం బ్యాంకింగ్ షేర్లకు నష్టాలే దిక్కయ్యాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం త్వరలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలుంటాయని, ముఖ్యంగా మొండి బకాయిలను తిరిగి వసూలు చేయడంలో బ్యాంకర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నుంచి సంకేతాలు రావడం మదుపరులను పెట్టుబడుల వైపునకు మళ్లించింది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనమవడం మిగతా రంగాలకు ఇబ్బందికరంగా మారినప్పటికీ.. ఎగుమతులపైనా ఆధారపడ్డ రంగాలకు, ముఖ్యంగా ఐటి రంగానికి కలిసొచ్చింది. ఐటి సంస్థల షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. అలాగే ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి కోలుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. దీంతో సూచీలు గడచిన వారం పరుగులు పెట్టాయి. కాగా, గడచిన వారంలో విదేశీ మదుపరుల కంటే కూడా దేశీయ మదుపరులే పెట్టుబడులు అధికంగా పెట్టడం గమనార్హం. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాల ప్రకారం గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 2,397.18 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. అయినప్పటికీ దేశీయ మదుపరుల మద్దతుతో మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, రియల్టీ, ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, విద్యుత్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 8.52 శాతం నుంచి 1.62 శాతం వరకు పెరిగింది. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ మాత్రం 1.59 శాతం పడిపోయింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 13,430.93 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 77,649.74 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 14,268.51 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 87,43 0.77 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.