బిజినెస్

ఎన్టీపిసి తెలంగాణ స్టేజ్-1 పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపిసి వద్ద 1,600 మెగావాట్ల విద్యుత్ యూనిట్ల నిర్మాణ పనులు చేపట్టామని, యూనిట్లను 2020 నాటికి పూర్తి చేసి ఉత్పత్తి దశలోకి తెస్తామని ఎన్టీపిసి ఇడి మహాపాత్ర తెలిపారు. శనివారం ఇక్కడ ఎన్టీపిసి ఇడిసి మిలియన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని అందించేందుకు బిల్లు లో అంగీకరించారన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేజ్-1లో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ 2 విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్మాణ పనులు జనవరి 29 నుండి ప్రారంభించామని, 52 నెలల్లో పనులను పూర్తిచేసి ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికతో పనులు చేపట్టామన్నారు. యూనిట్ల నిర్మాణం కోసం బిహెచ్‌ఇఎల్‌తో పాటు పలు కంపెనీలకు పనులను అప్పగించామని, యూనిట్ల నిర్మాణం కోసం అన్ని అనుమతులు పొంది పనులు వేగవంతం చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా 800 మెగావాట్లకు చెందిన సూపర్ క్రిటికల్ మరో 3 యూనిట్లను ప్రస్తుత ప్లాంట్ ను ఆనుకుని ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పాటుచేస్తున్న విద్యుత్ యూనిట్లు పూర్తయితే రామగుండం ఎన్టీపిసి 6,600 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యు త్ కేంద్రంగా ఎదుగుతుందన్నారు. 2,600 మెగావాట్లకు చెందిన 86.09 శాతం పిఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి జరుపుతూ వార్షిక ఉత్పత్తి 20 వేల మిలియన్ యూనిట్లు సాధిం చే దిశలో ముందుకు సాగుతోందన్నారు. కాగా, రామగుండం ఎన్టీపిసికి చెందిన యూనిట్ల నుండి రికార్డు స్థాయిలో విద్యుదు త్పత్తి జరిపి మరో అవార్డును కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్టీపిసి వద్ద నిర్మాణం జరుగుతున్న స్టేజ్-1 యూనిట్లకు సరిపడే బొగ్గును ఒడిశాలోని మందాకిని కోల్‌బ్లాక్ నుండి దిగుమతి చేసుకోవడానికి, నీటిని స్థానిక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తీసుకోడానికి ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటితో పాటు అనేక అనుమతులు పొందామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో జియంలు రాం కుబేర్, విఎం రాజన్, శ్రీనివాస్‌తో పాటు ఎజిఎం హరికుమార్, నందకిషోర్, పిఆర్ మేనేజర్ సహదేవ్ సేతి పలువురు అధికారులు పాల్గొన్నారు.

శనివారం
విలేఖరుల
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్టీపిసి ఇడి
మహాపాత్ర