బిజినెస్

దర్శిలో మారుతి సుజుకి డ్రైవింగ్ శిక్షణ పరిశోధన జాతీయ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ-పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని 18.51 కోట్ల రూపాయల వ్యయంతో పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు మారుతీ సుజికీ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తారు. ఈ శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ స్థాయిలో వాహన చోదకులకు శిక్షణ ఇవ్వడం వల్ల ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలతోపాటు నూతన టెక్నాలజీతో ఈ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. నూతన కేంద్రం ఏర్పాటుకు రాష్టప్రతి నుండి ఆమోద ముద్ర వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తున్న దీనిలో రాష్ట్ర రవాణా శాఖ, మారుతీ సుజికీ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. ఉపరితల రవాణా శాఖ 16.34 కోట్ల రూపాయలు అందజేస్తుందని, మిగిలిన 2.16 కోట్ల రూపాయల మొత్తాన్ని సుజికి ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే ఆ మొత్తాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ భరిస్తుందని మంత్రి రాఘవరావు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ, మారుతి సుజికీ ఇండియా లిమిటెడ్‌లు ఒక నెలలోపు ఒప్పందం కుదుర్చుకుని పనులను ప్రారంభిస్తారని అన్నారు. ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల అవుతాయని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు పుణే వారి పర్యవేక్షణలో జరుగుతుందని వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి దర్శిలో 20 ఎకరాల భూమిని కూడా సేకరించి రాష్ట్ర రవాణా శాఖ ఆధీనంలో ఉంచినట్టు పేర్కొన్నారు.