బిజినెస్

వినియోగదారుడికి అందుబాటులో ధరలుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి చౌక ఉత్పత్తులు అవసరమని, ఆ దిశగా పారిశ్రామిక రంగం ముందుకెళ్ళాల్సి ఉందని పతంజలి సంస్థ అధినేత, యోగా గురువు రామ్‌దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలన్నారు. ‘మీరు చేస్తున్న పనిలో 100 శాతం నిజాయితీ ఉంటే, మీరు తయారుచేసే ఉత్పత్తుల ధరలు కూడా చౌకగానే ఉంటాయి.’ అని ఈ సదస్సులో పాల్గొన్న 600లకుపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి బాబా అన్నారు. హరిద్వార్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న పతంజలి సంస్థ మార్కెట్‌లో 500లకుపైగా ఉత్పత్తులను అమ్ముతుండగా, ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 5,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.